Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సీ కామెంట్లపై దుమారం!!

ఠాగూర్
ఆదివారం, 25 ఆగస్టు 2024 (10:31 IST)
"కల్కి" చిత్రంలో హీరో ప్ర‌భాస్‍‌ని జోకర్‌గా చూపించార‌న్న బాలీవుడ్ నటుడు అర్ష‌ద్ వార్సి కామెంట్లు ఇపుడు పెను దుమారాన్ని రేపుతున్నాయి. ఈ విషయంలో బాలీవుడ్ వర్సెస్ టాలీవుడ్ అనే విధంగా మారిపోయింది. కేవ‌లం ప‌బ్లిసిటీ కోస‌మే అర్షద్ వ్యాఖ్యానించారని టాలీవుడ్‌కు చెందిన హీరోలు వ్యాఖ్యానిస్తున్నారు. ముఖ్యంగా టాలీవుడ్ యంగ్ హీరోలు సిద్దు, శ‌ర్వానంద్, సుధీర్‌బాబు డైరెక్టుగానే అర్ష‌ద్ వార్సీపై విమర్శలు సంధించారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కూడా ప‌దాలు కాస్త జాగ్ర‌త్త‌గా వాడాలంటూ అర్ష‌ద్‌కు సలహా ఇచ్చింది. 
 
ఇప్పుడు ఈ విష‌యంపై 'క‌ల్కి' ద‌ర్శ‌కుడు నాగ్ అశ్విన్ స్పందించారు. తన ఎక్స్ ఖాతాలో నాగ్ అశ్విన్ చేసిన ట్వీట్ హాట్ టాపిక్‌గా మారింది. చిత్ర‌సీమ‌ను వెన‌క్కి లాకెళ్లొద్ద‌ని, టాలీవుడ్ బాలీవుడ్ అనే స‌రిహ‌ద్దులు చెరిగిపోయాయ‌ని, దేశం మొత్తం సినిమా ఒక్క‌టే అని, ఆ దృష్టితోనే చిత్ర‌సీమ‌ని చూడాల‌ని నాగ్ అశ్విన్ ట్వీట్ చేశారు. అర్ష‌ద్ విమ‌ర్శ కాస్త హుందాగా ఉంటే బాగుండేద‌ని, ఆయ‌న ప‌దాల్ని మ‌రింత మెరుగ్గా ఉప‌యోగించాల్సింద‌న్నారు. 
 
'క‌ల్కి-2' కోసం మ‌రింత క‌ష్ట‌ప‌డ‌తాన‌ని.. ‌'క‌ల్కి-2'లో ప్ర‌భాస్ పాత్ర మ‌రింత గొప్ప‌గా, ఉన్న‌తంగా ఉంటుంద‌ని తెలిపారు. అర్ష‌ద్ పిల్ల‌ల‌కు బుజ్జి బోమ్మలను పంపుతాన‌ని పేర్కొన్నారు. ఇలా ప్రభాద్ - అర్షద్‌ల వివాదాన్ని నాగ్ అశ్విన్ పుల్ స్టాప్ పెట్ట‌డానికి తన పోస్ట్ ద్వారా ప్రయత్నించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Talakona: తలకోన సిద్ధేశ్వర స్వామి ఆలయంలో మెరుగైన సౌకర్యాలు

KPHB : వేశ్యతో గొడవ.. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌పై కత్తితో దాడి

Bus crash: ఆప్ఘనిస్థాన్‌లో ఘోర ప్రమాదం.. బస్సు- ట్రక్కు ఢీ.. 71మంది సజీవ దహనం

అన్నయ్యతో చెల్లెలు సంసారం.. ప్రెగ్నెంట్ కావడంతో భర్తకు డౌట్.. ఎందుకోసమంటే?

టీచర్‌ని ప్రేమించిన స్టూడెంట్.. చీర కట్టుకుని వచ్చింది.. పెట్రోల్ పోసి నిప్పంటించాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

తర్వాతి కథనం
Show comments