Webdunia - Bharat's app for daily news and videos

Install App

Raviteja: రవితేజ అనార్కలి సినిమాలో ముగ్గురు నాయికలు, అషికా రంగనాథ్ ఫిక్స్

దేవీ
బుధవారం, 4 జూన్ 2025 (20:07 IST)
Ashika Ranganath, Ravi Teja
తెలుగు హీరో మాస్ మహారాజా రవితేజ సక్సెస్ కోసం ప్రయత్నాలు చేస్తూనే వున్నాడు. మూడు సినిమాలు రన్నింగ్ లో వున్నాయి. తాజాగా భాను భోగవరపు దర్శకత్వంలో 'మాస్ జతార' చిత్రంలో నటిస్తున్నారు. టైటిల్ సూచించినట్లుగా ఇది ఒక మాస్ ఎంటర్టైనర్. ఈ చిత్రాన్ని  ఆగస్టు 27న విడుదల చేస్తున్నట్లు తెలిపారు. ఈ చిత్రం దాదాపు పూర్తికావచ్చింది. దానితోపాటు మరో సినిమా కూడా చేస్తున్నాడు.
 
ఇటీవలే దర్శకుడు కిషోర్ తిరుమలతో రవితేజ ఒక సినిమా కూడా సంతకం చేశారు. ఈ ప్రాజెక్ట్ కొన్ని నెలల క్రితం ఖరారు చేయబడినా కొన్ని కారణాలవల్ల ప్రకటించలేదు. తాజాగా మాస్ జాతర పూర్తికావస్తున్న నేపథ్యంలో త్వరలో అధికారికంగా ప్రకటించనున్నట్లు తెలిసింది. చిత్ర యూనిట్ సమాచారం మేరకు విశ్వంభర బ్యూటీ ఆషికా రంగనాథ్ ఈ చిత్రంలో రవితేజతో నటించనున్నది. ఆషికా ఇంతకుముందు అమిగోస్‌తో తెలుగులోకి అడుగుపెట్టింది.
 
రవితేజ,  కిషోర్ తిరుమల చిత్రానికి 'అనార్కలి' అనే టైటిల్ పెట్టారు. మరో ప్రముఖ నటి కూడా నటించే అవకాశం ఉంది. కేతికా శర్మ మరో మహిళా కథానాయికగా నటిస్తుందని చెబుతున్నారు. ప్రారంభంలో, మమిత బైజు, కయాదు లోహర్ కథానాయికలుగా నటిస్తారని ఊహాగానాలు వచ్చాయి, ఈ నెలలో చిత్రీకరణ ప్రారంభం కానుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పాఠశాల బాలిక కిడ్నాప్, కారులోకి నెట్టి దౌర్జన్యంగా (video)

2030 నాటికి 10.35 మిలియన్ల ఉద్యోగాలకు ఏజెంటిక్ ఏఐ 2025

ఏఫీలో మైక్రోసాఫ్ట్ ఎక్స్‌పీరియన్షియల్ జోన్ ఏర్పాటు చేయాలి.. నారా లోకేష్

కవిత విషయంలో రిస్క్ తీసుకోను.. ఆ సంగతి నాకు వదిలేయండి.. కేసీఆర్ పక్కా ప్లాన్

గొర్రె కాళ్లను తోకతో కట్టేసిన కోబ్రా, చాకచక్యంగా రక్షించిన యజమాని (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

తర్వాతి కథనం
Show comments