మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో, యంగ్ హీరో కిరణ్ అబ్బవరం కథానాయకుడిగా క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మిస్తున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ మీటర్. నూతన దర్శకుడు రమేష్ కడూరి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. సమ్మర్ స్పెషల్‌గా ఏప్రిల్ 7న విడుదల కానున్న ఈ సినిమా టీజర్ ని స్టార్ దర్శకుడు బాబీ కొల్లి లాంచ్ చేశారు.
యాక్షన్, ఎంటర్ టైమెంట్, కమర్షియల్ ఎలిమెంట్స్ అన్నీ సమపాళ్లలో పక్కా మాస్ మీటర్ తో టీజర్ ఆద్యంతం ఆకట్టుకుంది. కిరణ్ అబ్బవరం డాషింగ్ అండ్ మాస్ పోలీస్ ఆఫీసర్ గాఎంట్రీ ఇచ్చారు. యాక్షన్ సన్నివేశాలు నెక్స్ట్ లెవల్ లో వున్నాయి. కిరణ్ చేసిన డ్యాన్స్ మూమెంట్స్ ని మాస్ ని మురిపిస్తున్నాయి. నా మీటర్లో నేను వెళ్తా నన్ను గెలకొద్దు... నాకు అడ్డు రావద్దు అని కిరణ్ అబ్బవరం చెప్పిన డైలాగ్ పవర్ ఫుల్ గా వుంది.
కొత్త దర్శకుడు రమేష్ కడూరి అవుట్ అండ్ అవుట్ మాస్ కమర్షియల్ ఎంటర్ టైనర్ ని అందిస్తున్నాడని టీజర్ చూస్తే అర్ధమౌతోంది. సాయి కార్తీక్ నేపధ్య సంగీతం టీజర్ ని మరింత ఎలివేట్ చేసింది. వెంకట్ సి దిలీప్, సురేష్ సారంగం కెమరా పనితనం బ్రిలియంట్ గా వుంది. మైత్రీ మూవీ మేకర్స్, క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మాణ విలువలు ఉన్నతంగా వున్నాయి.
టీజర్ లాంచ్ ఈవెంట్ లో బాబీ కొల్లి మాట్లాడుతూ.. నిర్మాత చెర్రీ గారు చాలా క్లాస్ గా కనిపిస్తారు కానీ లోపల మాస్ మీటర్ వుంది. మా అసోషియేట్ రమేష్ పై నమ్మకం వుంచి ఈ సినిమా ఇచ్చిన చెర్రీ, మైత్రీ మూవీ మేకర్స్ కిరణ్ అబ్బవరం కు ధన్యవాదాలు. ఈ సినిమాతో కిరణ్ అబ్బవరం కు మాస్ మీటర్ ని సెట్ చేస్తోందని నమ్ముతున్నాను. టీజర్ చూస్తుంటే పక్కా మాస్ కమర్షియల్ మీటర్ అనిపిస్తోంది. ఈ సినిమా యూనిట్ అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్పారు.
కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ.. చిన్నపుడు ఎలాంటి సినిమాలు చూసి థియేటర్ లో విజల్స్ కొట్టి గోల చేశానో అలాంటి సబ్జెక్ట్ వున్న సినిమా మీటర్. ఒక యంగ్ హీరోని నమ్మి ఇంత పెట్టుబడి పెట్టడం చిన్న విషయం కాదు. నన్ను నమ్మి ఇంత పెట్టుబడి పెట్టిన నిర్మాత చెర్రీగారికి కృతజ్ఞతలు. ఎక్కడా రాజీ పడకుండా మంచి సినిమా తీయాలని చేశారు. ఇంత పెద్ద స్క్రిప్ట్ ని నాతో చేసిన దర్శకుడు రమేష్ కి థాంక్స్. థియేటర్ లో చాలా ఎక్సయిట్ అవుతారు. టీజర్ ఎలా పరిగెట్టిందో సినిమా కూడా అలానే ఆగకుండా మాస్ మీటర్ లో పరుగెడుతుంది. ఈ సినిమాలో పని చేసిన అందరికీ థాంక్స్. థియేటర్ లో విజల్స్ కొట్టి చూసే కమర్షియల్ సినిమా మీటర్. సినిమా బిగినింగ్ నుంచి చివరి వరకూ గోల గోలగా వుంటుంది. చాలా రచ్చ వుంటుంది. మాస్ మహారాజా రవితేజ గారి లాంటి సినిమానే ఇది. ఈ వేసవి లో రవితేజ గారి సినిమా చూడండి.. ఆయనలానే ఎంటర్ టైన్ చేసే మీటర్ సినిమా కూడా చూడండి. మీటర్ మిమ్మల్ని అలరిస్తుంది. అన్నారు
దర్శకుడు మాట్లాడుతూ.. నన్ను ఇంత దూరం తీసుకొచ్చిన బాబీ గారికి గోపీచంద్ మలినేని గారికి కృతజ్ఞతలు. ఏప్రిల్ 7న ఈ సినిమా పెద్ద హిట్ కాబోతుంది. అన్నారు
చెర్రి మాట్లాడుతూ.. టీజర్ రిలీజ్ చేసిన బాబీ గారికి కృతజ్ఞతలు. ఈ చిత్ర దర్శకుడు రమేష్ బాబీ, గోపీచంద్ మలినేని దగ్గర పని చేశారు. ఆ స్కూల్ నుంచి వచ్చిన రమేష్ కూడా ఒక చక్కని కథతో మాస్ కమర్షియల్ ఎంటర్ టైనర్ గా మీటర్ ని చేశారు. మైత్రీ మూవీ మేకర్స్ నవీన్ గారు రవి గారు నా వెనుక వుండి ఎంతగానో ప్రోత్సహించారు. ఈ సినిమా కిరణ్ కెరీర్ లో హయ్యస్ట్ బడ్జెట్ మూవీ అవుతుంది. ఎక్కడా రాజీపడకుండా నిర్మించాం. ఇందులో కిరణ్ అబ్బవరం ఇదివరకూ ఎన్నడూ కనిపించని మాస్ అవతార్ లో చూస్తారు. చాలా ఈజ్ తో చేశాడు. ఈ సినిమాలో పని చేసిన అందరూ అద్భుతంగా చేశారు. ఏప్రిల్ 7న అందరూ థియేటర్ లో సినిమా చూసి ఎంజాయ్ చేయాలి అని కోరారు