Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలుగులో ఇంకా సినిమా చచ్చిపోలేదంటే అదే కారణం : దర్శకుడు తేజ సెస్సేషనల్‌ తీర్పు

Webdunia
శనివారం, 29 ఏప్రియల్ 2023 (19:37 IST)
Director Teja
దర్శకుడు తేజ తాజాగా సోషల్‌ మీడియాలో హీరో గోపీచంద్‌ అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. గోపీచంద్‌ సినిమా రామబాణం వచ్చేనెల 5న విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా దర్శకుడు తేజ వినూత్నమైన ఇంటర్వ్యూ ఇచ్చాడు. తేజ కూడా డి.సురేష్‌ బాబు కొడుకు అభిరామ్‌తో అహింస అనే సినిమా చేశాడు. అది విడుదలకు త్వరలో నోచుకోనుంది.
 
ఇక గోపీచంద్‌కు తేజ చెప్పిన సమాధానం ఇదే. సినిమాను ఓటీటీ, సింగిల్‌ స్క్రీన్‌ చంపలేదు. కేవలం మల్టీప్లెక్స్‌ చంపేస్తుంది. అందులోనూ పాప్‌కార్న్‌ చంపేస్తుంది. అంటూ వివరించారు. నేను బాలీవుడ్‌ నుంచి అన్ని వుడ్‌లకు వెళ్ళీ అక్కడ కామన్‌ మేన్‌ నుంచి వివరాలు సేకరించాను. మిగిల్‌క్లాస్‌ సినిమాకు వెళితే బైక్‌ పార్కింగ్‌, ఆ తర్వాత పాప్‌కార్న్‌ కానీ సమోసా, కూల్‌ డ్రింక్ కానీ తాగుతూ సినిమా చూడాలనుకుంటే ఈ రేట్లు ఆడియన్‌ను భయపెట్టిస్తుంది. సినిమా టికెట్‌ కంటే ఈ రేట్లు ఎక్కువ. 
 
ముంబైలో సినిమా చచ్చిపోవడానికి కారణం మల్టీప్లెక్స్‌ థియేటర్లే. తెలుగులో ఇంకా సినిమా చచ్చిపోకుండా బతికి వుందంటే సింగిల్‌ స్క్రీన్‌ వుండడం వల్లనే. మల్టీప్లెక్స్‌ తెర అంటే మన ఇంటిలో టీవీకంటే కొంచెం ఎక్కువ వుంటుంది. అంతే తేడా. నా తీర్పు ఏమిటంటే ఓటీటీలు, టీవీలు సినిమాను చంపలేదు. కేవలం పాప్‌కార్న్‌ చంపేస్తుంది అని ముగించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆస్పత్రి ఎగ్జిక్యూటివ్ వేధింపులు.. మహిళా ఫార్మసిస్ట్ ఆత్మహత్య.. మృతి

ప్రైవేట్ బస్సులో మహిళపై సామూహిక అత్యాచారం.. ఇద్దరు కుమారుల ముందే..?

పచ్చడి కొనలేనోడివి పెళ్లానికేం కొనిస్తావ్ రా: అలేఖ్య చిట్టి పికిల్స్ రచ్చ (Video)

తిరుపతి-పళనిల మధ్య ఆర్టీసీ సేవలను ప్రారంభించిన పవన్ కల్యాణ్

కొండపై గెస్ట్ హౌస్ సీజ్.. కేతిరెడ్డికి అలా షాకిచ్చిన రెవెన్యూ అధికారులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

తర్వాతి కథనం
Show comments