Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత క్రికెటర్లందరికీ అమ్మాయిలే పుడుతున్నారు : అమితాబ్

Webdunia
గురువారం, 14 జనవరి 2021 (14:02 IST)
భారత క్రికెట్ జట్టుకు అనేక మంది క్రికెటర్లు ఓ ఇంటివారు అయిపోతున్నారు. గత నాలుగైదేళ్లుగా యువ క్రికెటర్లు వరుసబెట్టి పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో వివాహాలు చేసుకున్న క్రికెటర్లందరికీ అమ్మాయిలే పుడుతున్నారంటూ బాలీవుడ్ న‌టుడు అమితాబ్ బ‌చ్చ‌న్ చేసిన‌ ట్వీట్ వైరల్ అవుతోంది. 
 
కాగా, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి ఇటీవ‌లే కూతురు పుట్టిన విష‌యం విదిత‌మే. ఈ నేపథ్యంలోనే బిగ్ బీ దీనిపై స్పందించారు. భార‌త మాజీ, ప్ర‌స్తుత‌ క్రికెట‌ర్లు రైనా, గంభీర్‌, రోహిత్ శ‌ర్మ‌,  ష‌మి, ర‌హానే, జ‌డేజా, పుజారా, సాహా, భ‌జ్జీ, న‌ట‌రాజ‌న్‌, ఉమేశ్ యాద‌వ్‌లంద‌రికీ కూతుళ్లే పుట్టార‌ని బిగ్ బీ పేర్కొన్నారు. 
 
వీళ్లంతా భ‌విష్య‌త్తులో మ‌హిళ‌ల క్రికెట్ టీమ్‌ను త‌యారు చేస్తారా? అని ట్వీట్ చేశారు. అందులో ధోనీ కూతురు కెప్టెన్‌గా ఉంటుందేమో అంటూ చమత్కరించారు. దీంతో అమితాబ్‌పై కొంద‌రు నెటిజ‌న్లు మండిప‌డుతున్నారు. మ‌రికొంద‌రు సెటైర్లు వేస్తున్నారు.
 
కోహ్లీ దంపతులకు ఆడబిడ్డ
భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ సతీమణి, బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని కోహ్లీ తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించాడు. 
 
సోమవారం మధ్యాహ్నం తమకు బిడ్డ పుట్టిందనే విషయాన్ని మీకు తెలియజేయడానికి ఎంతో థ్రిల్ ఫీలవుతున్నానని కోహ్లీ ట్వీట్ చేశాడు. మీ అందరి ప్రేమాభిమానాలకు, ప్రార్థనలకు, విషెస్‌కు ధన్యవాదాలు అని తెలిపాడు.
 
కాగా, అనుష్క, బిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారన్నారు. తల్లిదండ్రులుగా తామిద్దరం కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్నామని చెప్పారు. ఈ సమయంలో తమకు కొంత ప్రైవసీ కావాలన్నారు.
 
ఈ విషయాన్ని అందరూ అర్థం చేసుకోవాలని కోరాడు. మరోవైపు తల్లిదండ్రులైన కోహ్లీ, అనుష్కలకు అభిమానుల నుంచి శుభాభినందనలు వెల్లువెత్తుతున్నాయి. కాగా, ప్రసవం సమయంలో భార్యవద్దే ఉండాలని భావించిన విరాట్ కోహ్లీ ఆస్ట్రేలియా క్రికెట్ పర్యటనకు దూరంగా ఉన్న విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసు : వల్లభనేని వంశీకి మళ్లీ నిరాశ

Bengaluru murder: ఉద్యోగం కోసం కీచులాటల్లో భార్యను హత్య చేసాడా? భార్యాభర్తల కాల్ డేటా చూస్తున్నారా?

త్రిభాషా విద్యా విధానం వద్దు.. ద్విభాషే ముద్దు... వక్ఫ్ బిల్లు రద్దు చేయాలి : విజయ్

మయన్మార్‌లో భారీ భూకంపం.. పేక మేడల్లా కూలిపోయిన భవనాలు (Video)

ఏపీలో పలుచోట్ల 42 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments