అందుకే సినీ ఇండస్ట్రీకి దూరమయ్యా.. ఇప్పుడు హ్యాపీగా వున్నా..?

Webdunia
సోమవారం, 1 జూన్ 2020 (12:00 IST)
Kalyani
సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ గురించి తెలిసిందే. శ్రీరెడ్డి, చిన్మయి వంటి వారు క్యాస్టింగ్ కౌచ్, లైంగిక వేధింపులపై ఇప్పటికే గళం విప్పారు. తాజాగా తమిళ ''జయం''లో సదాకు చెల్లెలుగా నటించిన కళ్యాణి బాలనటి నుంచి హీరోయిన్ స్థాయికి ఎదిగింది. 
 
ప్రస్తుతం సినిమాలకు దూరంగా వుంటుంది. ఇందుకు కారణాలు కూడా చెప్పుకొచ్చింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఇండస్ట్రీకి వచ్చిన కొత్తల్లోనే ప్రభుదేవాతో కలిసి అలై తండా వానమ్ చిత్రంలో నటించినట్టు చెప్పిన కల్యాణి.. తనకు వరుసపెట్టి అవకాశాలు వచ్చిన విషయాన్ని గుర్తు చేసింది. 
 
తనకు వరుసపెట్టి అవకాశాలు వస్తున్న సమయంలో ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులు తన తల్లికి ఫోన్ చేసి సినిమాల్లో నటించాలంటే కొన్ని విషయాల్లో సర్దుకుపోవాలని అన్నారని గుర్తు చేసుకుంది. పరిశ్రమలో తనకు ఎదురైన లైంగిక వేధింపుల వల్లే తాను ఇండస్ట్రీకి దూరమయ్యానని వెల్లడించింది. 
 
ప్రస్తుతం కుటుంబంతో కలిసి సంతోషంగా జీవిస్తున్నట్టు తెలిపింది. సర్దుకుపోవాలనే చాలామంది చెప్తుంటే.. వారి మాటలతోనే తాను సినీ రంగానికి దూరమైనట్టు కల్యాణి చెప్పింది. ఆ తర్వాత పలు సీరియళ్లలో నటించి పేరు తెచ్చుకున్నానని, అయితే, అక్కడ కూడా వేధింపులు ఎదురవడంతో ఇక పూర్తిగా నటనకు దూరమయ్యానని కల్యాణి వివరించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు.. ఆ గిరిజన గ్రామంలో పవన్ వల్ల విద్యుత్ వచ్చింది..

ఆంధ్రప్రదేశ్-ఒడిశా ఘాట్ రోడ్డులో కాలి బూడిదైన ఆర్టీసీ బస్సు.. ప్రయాణీకులకు ఏమైంది? (video)

Tea Biscuit: టీతో పాటు బిస్కెట్ టేస్టుగా లేదని.. టీ షాపు ఓనర్‌ని చంపేశాడు

Bihar Assembly Polls: బీహార్ అసెంబ్లీ ఎన్నికలు.. మొదటి దశ ఎన్నికలు ప్రారంభం

నడిరోడ్డుపైనే దేశాధ్యక్షురాలిని వాటేసుకుని ముద్దు పెట్టుకోబోయాడు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు డ్రాగన్ ఫ్రూట్ తింటే...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

బరువు పెరగాలనుకునేవారు ఈ 5 పదార్థాలు తింటే చాలు...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

తర్వాతి కథనం