Webdunia - Bharat's app for daily news and videos

Install App

బిగ్ బాస్‌పై రచ్చ ఎందుకు? ముద్దు సీన్ల సంగతేంటి? రజనీ పార్టీ పెడితే..?: కమల్ హాసన్

"బిగ్ బాస్" కోసం తాను తప్పు చేస్తానా? ఈ షో వల్ల సంప్రదాయాలు చెడిపోతాయనుకుంటే.. గత 11 సంవత్సరాల పాటు ఏం చేస్తున్నారు? అని కమల్ హాసన్ ప్రశ్నించారు. హిందీలో బిగ్ బాస్ వస్తే సంప్రదాయాలకు ఎలాంటి ఇబ్బంది ఉం

Webdunia
గురువారం, 13 జులై 2017 (09:00 IST)
"బిగ్ బాస్" కోసం తాను తప్పు చేస్తానా? ఈ షో వల్ల సంప్రదాయాలు చెడిపోతాయనుకుంటే.. గత 11 సంవత్సరాల పాటు ఏం చేస్తున్నారు? అని కమల్ హాసన్ ప్రశ్నించారు. హిందీలో బిగ్ బాస్ వస్తే సంప్రదాయాలకు ఎలాంటి ఇబ్బంది ఉండదా? అంటూ అడిగారు.

మరి సినిమాల్లో వచ్చే ముద్దుల సీన్ల సంగతి ఏంటి? ఆ సీన్లలో నటించిన వారిపై ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని కమల్ హాసన్ ప్రశ్నల వర్షం కురిపించారు. కొందరికి ఏదో ఒక రాద్ధాంతం చేయడం అలవాటని, కొంతమందికి తానేం చేసినా నచ్చదని చెప్పారు. 
 
ఇక బిగ్ బాస్ లాంటి షో కంటే అమీర్‌ ఖాన్‌ చేసిన ''సత్యమేవ జయతే" వంటి కార్యక్రమం చేయవచ్చు కదా? అని కమల్ హాసన్‌ను కొందరు అడిగారు. దీనిపై కమల్ స్పందిస్తూ.. వాళ్లు తెరమీద చేస్తున్నది తాను 37 ఏళ్లుగా నిజజీవితంలో చేస్తున్నానని చెప్పారు. తనకు వీలైనంత సాయం చేస్తూనే వున్నాని చెప్పారు.
 
ఇక రజనీ రాజకీయ ప్రవేశంపై కమల్ మాట్లాడుతూ.. సిస్టమ్‌ బాగాలేదని నేను రెండేళ్ల క్రితమే చెప్పాను. రజనీ ఇప్పుడే చెప్పారు. ఒక వేళ రజనీ పార్టీ పెడితే.. న్యాయంగా ఉండి అంతా మంచే జరిగితే ఓకే. కానీ న్యాయం లేకపోతే.. ప్రస్తుతం ఎలా పార్టీలను విమర్శిస్తున్నానో.. అదే విధంగా రజనీని కూడా ఏకిపారేస్తాను. ఇందులో ఎలాంటి మార్పు వుండదు. రజనీకి ఎలాంటి మినహాయింపు ఉండదని స్పష్టం చేశారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Putin: వ్లాదిమిర్ పుతిన్‌తో ఫోనులో మాట్లాడిన మోదీ.. భారత్‌కు రావాలని పిలుపు

బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీకి భారీ వర్ష సూచన

Moving Train: కదులుతున్న ప్యాసింజర్ రైలు నుంచి పడిపోయిన మహిళ.. ఏం జరిగింది?

సుంకాల మోత... అమెరికాకు షాకిచ్చిన భారత్ - యుద్ధ విమానాల డీల్ నిలిపివేత?

YSRCP: వైఎస్ఆర్ కడప జిల్లాలో పోలింగ్ కేంద్రాలను తరలించవద్దు.. వైకాపా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూర్చుని చేసే పని, పెరుగుతున్న ఊబకాయులు, వచ్చే వ్యాధులేమిటో తెలుసా?

Heart attack: వర్షాకాలంలో గుండెపోటు ప్రమాదం ఎక్కువా?

కాలిఫోర్నియా బాదంతో ఆరోగ్యకరమైన రీతిలో రక్షా బంధన్‌ను వేడుక చేసుకోండి

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments