Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలుగు నిర్మాతలు పెద్దమనుషులే కానీ.. బిచ్చగాళ్లవుతున్నారు.. తమిళ దర్శకుడి విచారం

తెలుగు సినీ నిర్మాతలు ఫ్లైట్ టిక్కెట్లు ఇచ్చే బిచ్చగాళ్లుగా మారారని సీనియర్‌ దర్శకుడు ఆర్‌వీ.ఉదయకుమార్‌ అన్నారు. తెలుగు చిత్ర పరిశ్రమలో తమిళ కళాకారులకు చాలా గౌరవం అని పేర్కొన్నారు. అంతటి గౌరవం కొలీవుడ్‌లోనే లేదన్నారు. తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రతిభకు

Webdunia
గురువారం, 13 జులై 2017 (07:13 IST)
తెలుగు సినీ నిర్మాతలు ఫ్లైట్ టిక్కెట్లు ఇచ్చే బిచ్చగాళ్లుగా మారారని సీనియర్‌ దర్శకుడు ఆర్‌వీ.ఉదయకుమార్‌ అన్నారు. తెలుగు చిత్ర పరిశ్రమలో తమిళ కళాకారులకు చాలా గౌరవం అని పేర్కొన్నారు. అంతటి గౌరవం కొలీవుడ్‌లోనే లేదన్నారు. తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రతిభకు గుర్తింపునిస్తారని, సార్‌, డైరెక్టర్‌ గారు ఎప్పుడు వస్తున్నారు ఫ్లైట్ టిక్కెట్‌ బుక్‌ చేయమంటారా అని అడుగుతారన్నారు. అలా ఫ్లైట్ టిక్కెట్స్‌ కొంటూ, కొంటూనే కొందరు తెలుగు నిర్మాతలు బిచ్చగాళ్లగా మారారని పేర్కొన్నారు. అదే కోలీవుడ్‌లో దర్శకుడికి ఫ్లైట్ టిక్కెట్‌ ఇవ్వడానికి నిర్మాతలు తెగ బాధ పడిపోతుంటారని ఉదయకుమార్‌ అన్నారు. 
 
ప్రముఖ తెలుగు నిర్మాత సిందూరపువ్వు కృష్ణారెడ్డి తాజాగా నిర్మిస్తున్న త్రిభాషా భారీ చిత్రం విన్నైతాండి వంద ఏంజల్‌. ఆయన కొడుకు నాగాన్వేషణ్‌ కథానాయకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రంలో ఆయనకు జంటగా హెబ్బాపటేల్‌ కథానాయకిగా నటిస్తోంది. బాహుబలి చిత్రానికి రాజమౌళి వద్ద సహాయదర్శకుడిగా పనిచేసిన కే.పళని దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రానికి బీమ్స్‌ సినీరోలియో సంగీతాన్ని అందిస్తున్నారు. కాగా ఈ చిత్ర ఆడియో ఆవిష్కరణ బుధవారం ఉదయం చెన్నైలో జరిగింది.
 
17 ఏళ్ల తరువాత.. చిత్ర నిర్మాత సిందూరపూవ్వు కృష్ణారెడ్డి మాట్లాడుతూ 17 ఏళ్ల తరువాత మళ్లీ చెన్నై వచ్చానని అన్నారు. విన్నైతాండి వంద ఏంజల్‌ చిత్రం గురించి చెప్పాలంటే ఇది బాహుబలి చిత్రం తరహాలో సాగే సోషియో ఫాంటసీ, కామెడీ, లవ్‌ ఎంటర్‌టెయినర్‌ కథా చిత్రం అని తెలిపారు. ఇందులో సీజీ వర్క్‌ హైలెట్‌గా ఉంటుందన్నారు. దర్శకుడు బాహుబలి కే.పళని తనను కలిసి కథ చెప్పారన్నారు. 
 
ఈ చిత్రం తమిళంలోనూ బాగుంటుందని దర్శకుడు చెప్పడంతో ద్విభాషా చిత్రంగా చేయడానికి సిద్ధం అయ్యామని, ఆ తరువాత ముంబైకి చెందిన రుషేంద్రరెడ్డి అనే నిర్మాత చిత్రంలోని సీజీ వర్క్‌ను చూసి చిత్రానికి ఇంత ఖర్చు చేస్తున్నారు వర్కౌట్‌ అవుతుందా అని అడిగారన్నారు. కథ డిమాండ్‌ మేరకు ఖర్చు పెడుతున్నామని చెప్పగా హిందీ వెర్షన్‌ హక్కులు తనకు ఇస్తారా అని అడిగారన్నారు.అలా ఈ చిత్రం త్రిభాషా చిత్రం అయ్యిందని సిందూరపువ్వు కృష్ణారెడ్డి వివరించారు. తెలుగులో ఇంకా ఈ సినిమాకు పేరుపెట్టలేదు.
 
అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రియాంకా గాంధీ భర్తకు ఏడేళ్ల కఠిన జైలుశిక్ష విధించాలి : ఈడీ

ఎయిర్‌పోర్టులకు ధీటుగా రైల్వే స్టేషన్ల అభివృద్ధి : డాక్టర్ పెమ్మసాని

భర్తతో గొడవపడి ముగ్గురు పిల్లలతో కలిసి కాలువలో దూకిన భార్య

బాబాయిని చంపిన అబ్బాయి బ్యాచ్‌కు ఓటు వేద్దామా? పులివెందులలో టీడీపీ వినూత్న ప్రచారం

మేమే బాస్‌ అనుకునేవారికి భారత్ వృద్ధి నచ్చలేదు : రాజ్‌నాథ్ సింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూల్‌డ్రింక్స్ తాగితే పక్షవాతం తప్పదంటున్న వైద్య నిపుణులు

స్నాక్స్ గుగ్గిళ్లు తింటే బలం, ఇంకా ఏం ప్రయోజనాలు?

కూర్చుని చేసే పని, పెరుగుతున్న ఊబకాయులు, వచ్చే వ్యాధులేమిటో తెలుసా?

Heart attack: వర్షాకాలంలో గుండెపోటు ప్రమాదం ఎక్కువా?

కాలిఫోర్నియా బాదంతో ఆరోగ్యకరమైన రీతిలో రక్షా బంధన్‌ను వేడుక చేసుకోండి

తర్వాతి కథనం
Show comments