భ‌విష్య‌త్‌లో ఓటీటీకి సినిమాకూ తేడా వుండ‌దు - వ‌రుణ్ తేజ్‌

Webdunia
శుక్రవారం, 12 నవంబరు 2021 (07:49 IST)
Sangeeth Shobhan, Varun Tej, Simrann
ఇప్పుడు సినిమాలు థియేట‌ర్ల‌లో విడుద‌ల‌వుతున్నాయి. క‌రోనా వ‌ల్ల ఓటీటీ అనే కొత్త ప్లాట్ ఫామ్ వ‌చ్చింది. మొద‌ట్లో దాని  గురించి అంతా భ‌య‌ప‌డ్డారు. కానీ దాని వ‌ల్ల కొత్త త‌రం ప్ర‌తిభ‌గ‌ల‌వారు వెలుగులోకి వ‌స్తున్నారు. ఇప్ప‌టికే న‌ట‌న‌తో అంతో కొంత అనుభ‌వం వున్న మెగా ఫ్యామిలీ ఆడ‌బిడ్డ నీహారిక ఇప్పుడు నిర్మాత‌గా ఓటీటీకి ఓ సినిమా చేసింది. `ఓ చిన్న ఫ్యామిలీ` అని దానికి పేరు పెట్టారు. అది జీ5 ఓటీట‌లో ఈనెల 19న విడుద‌ల కాబోతుంది. ఈ సంద‌ర్భంగా కర్టెన్ రైజ‌ర్‌గా హైద‌రాబాద్ గురువారం రాత్రి చిన్న వేడుక జ‌రిపారు.
 
ఇందులో వ‌రుణ్ తేజ్ పాల్గొన్నారు. నీహారిక ఏడాది నుంచి నాకు ఓ సీరీస్ గురించి చెబుతోంది. త‌నేదో చేస్తుంది అనుకున్నా. కొత్త ప్ర‌యోగాలు చేయ‌డం త‌న‌కు మంచి ఆస‌క్తి. మొన్న‌నే ట్రైల‌ర్ చూపించింది. చూశాక షాక్ అయ్యా. సినిమాలా వుంద‌ని అన్నారు. అందులో న‌టించిన న‌టీనుటుల న‌ట‌న చాలా స‌హ‌జంగా వుంది. భ‌విష్య‌త్ లో ఓటీటీకి సినిమాకూ తేడా వుండ‌దు అని చెప్పారు.
 
నీహారిక మాట్లాడుతూ, ఫ్యామిలీ డ్రామాతో ఈ సీరిస్ చేశాం. సంగీత్ శోభ‌న్‌, సిమ్ర‌న్ బాగా న‌టించారు. సీనియ‌ర్ న‌రేశ్ వెబ్ సిరీస్ చేయ‌డం తొలిసారి. ఆయ‌న ఈ పాత్ర‌లో జీవించారని చెప్పారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

విశాఖలో Google AI, 200 ఉద్యోగాలకు ఏడాదికి రూ.22,000 కోట్లా?: గుడివాడ అమర్నాథ్ ప్రశ్న

లైట్స్, కెమెరా, అబుధాబి: రణ్‌వీర్ సింగ్‌తో ఎక్స్‌పీరియన్స్ అబుధాబి కొత్త బ్రాండ్ అంబాసిడర్‌గా దీపికా పదుకొణె

శ్రీవారి ప్రసాదం ధర పెంపు? క్లారిటీ ఇచ్చిన తితిదే చైర్మన్

ఇన్‌స్టాగ్రాంలో ఎవడితో చాటింగ్ చేస్తున్నావ్, భర్త టార్చర్: వివాహిత ఆత్మహత్య

అద్దెకి ఇచ్చిన ఇంటి బాత్రూంలో సీక్రెట్ కెమేరా పెట్టిన యజమాని, అరెస్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

హృద్రోగుల్లో అత్యధిక శాతం 50 ఏళ్ల లోపువారే: టాటా ఏఐజీ సర్వేలో వెల్లడి

తర్వాతి కథనం
Show comments