Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

''గని" సాంగ్ ప్రోమో: డిసెంబర్ 3న సినిమా రిలీజ్

Advertiesment
Ghani Anthem Promo
, మంగళవారం, 26 అక్టోబరు 2021 (19:53 IST)
Ghani
మెగా ప్రిన్స్ హీరోగా రాబోతున్న కొత్త సినిమా 'గని'. అల్లు అర‌వింద్ స‌మ‌ర్పణ‌లో రెన‌సాన్స్ ఫిలింస్‌, బ్లూ వాట‌ర్ క్రియేటివ్ ప‌తాకాల‌పై సిద్ధు ముద్ద, అల్లు వెంక‌టేష్ (బాబీ) ఈ 'గని' చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వరుణ్ తేజ్ సరసన బాలీవుడ్ బ్యూటీ సయీ మంజ్రేక‌ర్ హీరోయిన్‌‌గా నటిస్తోంది. ఉపేంద్ర, సునీల్ శెట్టి, జగపతిబాబు, నవీన్ చంద్ర ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. 
 
కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో బాక్సింగ్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ మూవీ కోసం వరుణ్ తేజ్ ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్నారు. వరుణ్ తేజ్ కెరీర్‌లో ఈ మూవీ చాలా డిఫరెంట్‌గా ఉండాలని టార్గెట్ పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ మూవీ నుంచి తొలి లిరికల్ సాంగ్ 'గని' ప్రోమో రిలీజ్ చేసి ప్రేక్షకులను ఆకర్షించారు. 'దేకో హిం గని.. కనివిని ఎరుగని' అంటూ వస్తున్న తమన్ బీట్, వరుణ్ తేజ్ మేకోవర్ ఈ సాంగ్ పట్ల ఆసక్తి పెంచేశాయి. 
 
పూర్తి పాటను రేపు (బుధవారం) ఉదయం 11.08 గంటలకు రిలీజ్ చేయనున్నట్లు తెలిపింది చిత్రయూనిట్. ఈ మూవీ కోసం వరుణ్ తేజ్ ప్రత్యేకంగా బాక్సింగ్‌లో శిక్షణ తీసుకున్నారు. జిమ్ములో తెగ కష్టపడి బాడీ బిల్డ్ చేసి తనను తాను సరికొత్తగా ఆవిష్కరించుకోబోతున్నారు. ఇటీవలే విడుదలైన 'గని ఫస్ట్ పంచ్' గ్లింప్స్ భారీ రెస్పాన్స్ తెచ్చుకుంది. డిసెంబర్ 3న విడుదల కానున్న ఈ మూవీపై మెగా అభిమానుల్లో బోలెడన్ని అంచనాలున్నాయి.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సమంత కేసులో కోర్టు ఇచ్చిన తీర్పు ఇదే...