Webdunia - Bharat's app for daily news and videos

Install App

న‌టికి కొల‌త‌లు వుండ‌కూడ‌దుః విద్య‌బాలాన్‌

Webdunia
శనివారం, 5 జూన్ 2021 (16:32 IST)
sherni
శ్రీదేవి ప్ర‌ధాన పాత్ర‌గా శ‌థ్రుఘ్న‌సిన్హా కాంబినేష‌న్‌లో 1988లో షేర్ని సినిమా వ‌చ్చింది. ఇప్పుడు అదే పేరుతో సినిమా వ‌స్తోంది. ఇందులో విద్యాబాల‌న్ కీల‌క పాత్ర పోషించింది. విద్యాబాలన్ ఎటువంటి పాత్ర‌నైనా పోషించ‌డానికి సిద్ద‌మంటోంది. ఇప్ప‌టికే ప‌లు భిన్న‌మైన పాత్ర‌ల‌ను ఆమె పోషించింది. తాజాగా `షేర్ని` అనే సినిమాలో న‌టించింది. ఇది అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రత్యేకంగా ఈ నెల 18 న విడుదల కానుంది,

ఇటీవ‌లే టీజ‌ర్ విడుద‌ల చేశారు. ఇందులో ఆమె క‌ర‌డుగ‌ట్టిన మ‌నుషులు వుండే అట‌వీ ప్రాంతంలో అట‌వీ అధికారిణిగా న‌టించారు. ట్రైల‌ర్‌లో ఓ డైలాగ్ వుంటుంది. పెద్ద పెద్ద మ‌గాళ్ళే సాల్వ్ చేయ‌ని స‌మ‌స్య ఆడ‌ది ఆఫీస‌ర్‌గా ఏం చేస్తుంది? అనేది. ఈడైలాగ్ ఆమె చెవిన ప‌డుతుంది. ఆ త‌ర్వాత ఆమె ఎలా రియాక్ట్ అవుతుంది? అస‌లు క‌థేమిటి? అనేది పూర్తిస్థాయి అట‌వీ నేప‌థ్యంలో సాగే క‌థ ఇది. విద్యాబాలన్‌తో పాటు, శరత్ సక్సేనా, ముకుల్ చడ్డా, విజయ్ రాజ్, ఇలా అరుణ్, బ్రిజేంద్ర కాలా, నీరజ్ కబీ న‌టిస్తున్నారు.
 
ఈ పాత్ర గురించి ఆమె మాట్లాడుతూ, నేను ఈ క‌థ విన‌క‌ముందు ఆ ప్ర‌పంచాన్ని గొప్ప‌గా ఊహించుకున్నా. కానీ క‌థ విన్నాక నేను చాలా ఆశ్చ‌ర్య‌పోయా. ఇలాంటి ర‌క్తంతాగే మ‌నుషులు కూడా వుంటారా? అనిపించింది. అందుకే న‌టికి ప‌లానా పాత్ర చేయాల‌నే కొలమానాలే పెట్టుకోకూడ‌ద‌ని నేను వెంట‌నే ఈ పాత్ర‌ను చేయ‌డానికి సిద్ధ‌మ‌య్యా. మ‌నిషికి మ‌నిషికి మ‌ధ్య గౌర‌వ‌మేకాదు. జంతువు మ‌ధ్య కూడా వుండాలి. ఇలాంటి సున్నిత‌మైన అంశం న‌న్ను బాగా ఆక‌ట్టుకుంది అని తెలిపారు.
 
టి-సిరీస్, అబుండాంటియా ఎంటర్టైన్మెంట్ భాగ‌స్వామ్యంతో భూషణ్ కుమార్, క్రిషన్ కుమార్, విక్రమ్ మల్హోత్రా, అమిత్ మసూర్కర్ నిర్మించిన షెర్ని 2021 జూన్ 18 నుండి అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రత్యేకంగా ప్రసారం కానుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

16 యేళ్లలోపు పిల్లలను సోషల్ మీడియాకు దూరంగా ఉంచాల్సిందే...

ఢిల్లీలో పవన్ కళ్యాణ్ 'తుఫాన్' - నేడు ప్రధాని మోడీతో భేటీ!!

EVM లపై సుప్రీంకోర్టు కీలక తీర్పు, మీరు గెలిస్తే ట్యాంపరింగ్ కాదా అంటూ ప్రశ్న

ఒకే ఒక్క విద్యార్థిని... పాఠశాల యేడాది ఖర్చు రూ.12.48 లక్షలు (Video)

శని శింగ్నాపూర్‌లో శని భగవానుడి చుట్టూ పిల్లి ప్రదక్షిణలు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments