Webdunia - Bharat's app for daily news and videos

Install App

సినిమాలో ముద్దు సీన్ ఉంటుంది.... ముందుగా రిహార్సల్ చేద్దాం...

Webdunia
శనివారం, 5 జూన్ 2021 (16:30 IST)
అనేక మంది సినీ హీరోయిన్లను అవకాశాల పేరుతో కొందరు లైంగికంగా వాడుకుంటున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఇటీవల మీటూ ఉద్యమం పేరుతో అనేక హీరోయిన్లు తమకు ఎదురైన అనుభవాలను బహిర్గతం చేశారు. ఇవి చిత్ర పరిశ్రమను ఓ కుదుపు కుదిపేశాయి. 
 
ఈ క్రమంలో తాజాగా బాలీవుడ్ హీరోయిన్ జరీన్ ఖాన్ తాను ఎదుర్కొన్న భయానక అనుభవాలను ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. ఓ కాల్ సెంటర్‌లో పని చేస్తూ తాను బాలీవుడ్ అవకాశాల కోసం ప్రయత్నించానని... బాలీవుడ్‌కు వచ్చిన తొలినాళ్లలో తనకు ఓ దర్శకుడు పరిచయం అయ్యాడని... ఎంతో మంచి వ్యక్తిలా తనతో మాట్లాడేవాడని జరీన్ తెలిపింది. 
 
ఓ సినిమాలో అవకాశం ఇప్పిస్తానని...  అందులో ముద్దు సన్నివేశం ఉంటుందని... దానికి ముందుగానే రిహార్సల్స్ చేద్దామని తనను పిలిచి, చాలా అసభ్యంగా ప్రవర్తించేవాడని చెప్పింది. తనను దారిలోకి తెచ్చుకునేందుకు ఎన్నో విధాలుగా ప్రయత్నించాడని తెలిపింది. 
 
సినిమా ఆఫర్లను తెప్పించే బాధ్యత తనదే అని చెపుతూ, తనను నమ్మించే ప్రయత్నం చేశాడని చెప్పింది. ఆ తర్వాత అతని బారి నుంచి తాను తప్పించుకున్నానని తెలిపింది. సల్మాన్ సరసన బాలీవుడ్‌లో అరంగేట్రం చేసిన జహీర్ ఖాన్.. ఆ తర్వాత పలు హిట్ చిత్రాల్లో నటించి ప్రేక్షకులకు దగ్గరైంది. తెలుగులో గోపీచంద్ సరసన తెరకెక్కిన 'చాణక్య' సినిమాలో కూడా నటించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కుప్పంలో హిందాల్కో ఇండస్ట్రీస్- ఏపీ పారిశ్రామిక చరిత్రలో ఒక మైలురాయి.. ఐఫోన్ పార్ట్స్?

TDP: జిల్లా కమిటీలను త్వరలో ప్రకటిస్తాం.. చంద్రబాబు నాయుడు ప్రకటన

నర్మాలలో కలిసిన ఆ ఇద్దరు.. కరచాలనం చేసుకున్న కేటీఆర్-బండి సంజయ్ (video)

చంద్రబాబు బాటలో పవన్-ఎమ్మెల్యేల పనితీరుపై దృష్టి.. ర్యాంకులు కూడా ఇస్తారట

Brain cells: పనిపిచ్చి ఎక్కువ గల వారు మీరైతే.. ఇక జాగ్రత్త పడండి...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

డయాబెటిస్ వున్నవారిలో చాలామందికి కిడ్నీలు పాడైపోవడానికి కారణాలు ఏమిటి?

శొంఠి పాలు ఆరోగ్య ప్రయోజనాలు, మోతాదుకి మించి తాగితే?

ఉదయం పూట గుండె పోటు వచ్చే ప్రమాదం అధికం, కారణాలు ఏమిటి?

రుతుక్రమం రాకుండా వుండేదుకు హార్మోన్ పిల్ వేసుకున్న 18 ఏళ్ల యువతి మృతి, ఎందుకో తెలుసా?

తర్వాతి కథనం