Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలుగులోనే ఎక్కువ అభిమానులున్నారు, అందుకే మ్యూజికల్ కాన్సర్ట్ : సిధ్ శ్రీరామ్

డీవీ
మంగళవారం, 21 జనవరి 2025 (13:52 IST)
Nitin Kanakaraj, Sidh Sriram
ప్రముఖ సింగర్ సిధ్ శ్రీరామ్ హైదరాబాద్‌లో లైవ్ కాన్సర్ట్ నిర్వహించబోతోన్నాడు. ఫిబ్రవరి 15న ఈ లైవ్ మ్యూజిక్ కాన్సర్ట్‌ను మూవ్78 లైవ్ సంస్థ ప్లాన్ చేసింది. ఈ కాన్సర్ విశేషాల్ని తెలియజేసేందుకు మూవ్78 లైవ్ సంస్థ సీఈవో నితిన్ కనకరాజ్, సింగర్ సిధ్ శ్రీరామ్ మీడియా ముందుకు వచ్చారు.
 
ఈ మేరకు సిధ్ శ్రీరామ్ మాట్లాడుతూ.. ‘గత పదేళ్ల నుంచి తెలుగు ఆడియెన్స్ ఎంతో ప్రేమను కురిపిస్తూనే ఉన్నారు. నాకు తెలుగులోనే ఎక్కువ మంది అభిమానులున్నారు. మూడేళ్ల క్రితం హైదరాబాద్‌లో లైవ్ కాన్సర్ట్ చేశాను. మళ్లీ ఇప్పుడు చేయబోతోన్నాం. ఈ కాన్సర్ట్‌లో నా పాటలతో పాటుగా 80, 90వ దశకంలో వచ్చిన మెలోడీ పాటల్ని కూడా పాడతాను. నేను ప్రస్తుతం తెలుగు నేర్చుకుంటున్నాను. నాకు ఓ ఏడాది టైం ఇవ్వండి తెలుగులో ఫ్లూయెంట్‌గా మాట్లాడేందుకు ప్రయత్నిస్తాను’ అని అన్నారు. 
 
నితిన్ కనకరాజ్ మాట్లాడుతూ.. ‘సిధ్ శ్రీరామ్‌తో మూడేళ్ల తరువాత మళ్లీ హైదరాబాద్‌లో లైవ్ కాన్సర్ట్ నిర్వహిస్తున్నాం. ఫిబ్రవరి 15న ఈ ఈవెంట్‌ను నిర్వహించబోతోన్నాం. ఈ కాన్సర్ట్ ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియెన్స్ కోసం, యూత్ కోసం ఏర్పాటు చేస్తున్నాం.నాకు పర్సనల్‌గా సిధ్ శ్రీరామ్ అంటే చాలా ఇష్టం. ఈ జనరేషన్‌కు సిధ్ అంటే చాలా ఇష్టం. ఈ ఈవెంట్‌, లైవ్ కాన్సర్ట్ అద్భుతంగా ఉండబోతోంది. గ్రూపుగా టికెట్లు బుక్ చేసుకుంటే డిస్కౌంట్ కూడా ఉంటుంది’ అని అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కొత్తగా 10 రైళ్లను ప్రవేశపెట్టిన భారతీయ రైల్వే.. ముందస్తు రిజర్వేషన్ లేకుండానే...

డోనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం... జన్మతః పౌరసత్వం చట్టం

Tulasi Reddy: నారా లోకేష్‌కు డిప్యూటీ సీఎం పదవి.. నవ్వు తెప్పిస్తుంది.. తులసి రెడ్డి

ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే తనపని మొదలెట్టిన డోనాల్డ్ ట్రంప్!!

అధ్యక్ష భవనాన్ని మాత్రమే వీడాను... పోరాటాన్ని కాదు.. జో బైడెన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Golden Milk: గోల్డెన్ మిల్క్ హెల్త్ బెనిఫిట్స్

అంజీర్ పండ్లు అద్భుత ప్రయోజనాలు

కర్నూలుకు అత్యున్నత ప్రమాణాలతో కూడిన ఫెర్టిలిటీ కేర్‌ను తీసుకువచ్చిన ఫెర్టీ9

భారతదేశంలో డిజిటల్ హెల్త్ అండ్ ప్రెసిషన్ మెడిసిన్ సెంటర్‌: లీసెస్టర్ విశ్వవిద్యాలయంతో అపోలో భాగస్వామ్యం

తిన్నది గొంతులోకి వచ్చినట్లుంటుందా?

తర్వాతి కథనం
Show comments