భారతీయ మార్కెట్లలో అరటిపండ్లు సాధారణంగా డజనుకు ఇంతని అమ్ముతుంటారు. ప్రస్తుత ధరలు డజనుకు రూ.60 నుండి రూ.80 వరకు ఉంటాయి. అయితే, ఇటీవల హైదరాబాద్‌లో ఒక రష్యన్ పర్యాటకుడు ఎదుర్కొన్న అసాధారణ అనుభవం అతన్ని ఆశ్చర్యపరిచింది.
ఒక వీధి వ్యాపారి ఒక అరటిపండు రూ.100లకు అమ్మాడు. ఈ విషయాన్ని పర్యాటకుడు సోషల్ మీడియాలో పంచుకున్నాడు. వీడియోలో, రష్యన్ పర్యాటకుడు వీధి వ్యాపారిని పలకరించి, ఒకే అరటిపండు ధర గురించి ఆరా తీస్తాడు. పర్యాటకుడికి ఆ వ్యాపారి ఒక అరటి పండు వంద రూపాయలని సమాధానం ఇస్తాడు.
తాను ఒక అరటిపండు ధర అడుగుతున్నానని పర్యాటకుడు పదే పదే స్పష్టం చేసినప్పటికీ, పర్యాటకుడు అదే ధరను చెప్పాడు. దీంతో పర్యాటకుడు కొనుగోలు చేయడానికి నిరాకరించి వెళ్ళిపోయాడు.
తన పోస్ట్‌లో, యూకేలో అదే ధరకు ఎనిమిది అరటిపండ్లను కొనుగోలు చేయవచ్చు. ఇక్కడ హైదరాబాద్‌లో, అది కేవలం ఒక అరటిపండ్లకు వందరూపాయలు పలుకుతుందని పర్యాటకుడు పేర్కొన్నాడు. ఈ వీడియో నెట్టింట వైరల్ అయ్యింది.