ఆగస్టు 13న నిహారిక నిశ్చితార్థం: వెల్లడించిన వరుణ్

Webdunia
బుధవారం, 29 జులై 2020 (14:53 IST)
మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె నిహారిక. సినీ హీరోయిన్. బుల్లితెర యాంకర్ కూడా. అయితే, ఈమె త్వరలోనే ఓ ఇంటికి కోడలు కాబోతుంది. గుంటూరుకు చెందిన యువ పారిశ్రామికవేత్త చైతన్య అనే యువకుడిని పెళ్ళాడనుంది. ఈ వివాహ వేడుకను త్వరలోనే నిర్వహిస్తామని తండ్రి నాగబాబు ఇటీవల వెల్లడించారు. 
 
అయితే, తాజాగా నిహారిక అన్నయ్య, సినీ హీరో వరుణ్ తేజ్ ఈ వివాహంపై స్పందిస్తూ, నిశ్చితార్థ తేదీని వెల్లడించాడు. ఆగ‌స్టు 13వ తేదీన ఇరు కుటుంబాల పెద్ద‌ల స‌మ‌క్షంలో వారి ఎంగేజ్‌మెంట్ జ‌ర‌గ‌నుందని స్పష్టతనిచ్చాడు. కాగా, ఈ వేడుకను గుంటూరులో కొద్దిమంది బంధువుల మధ్య నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. 
 
కాగా, ఇటీవల తనకు కాబోయే భర్తతో కలిసి నిహారిక దిగిన ఫోటోలను ఇటీవల సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా, అవి వైరల్ అయ్యాయి. దీంతో నిహారిక పెళ్లిపై ఓ క్లారిటీ వచ్చింది. అప్పటి వరకు ఆమెకు పలువురు టాలీవుడ్ హీరోలకు ముడిపెడుతూ అనేక కథనాలు వచ్చిన విషయం తెల్సిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రాజస్థాన్‌లో ప్రశ్నపత్రం లీక్ : నీట్ ప్రవేశ పరీక్ష రద్దు

విజయ్ పార్టీ ఎమ్మెల్యేకు షాకిచ్చిన మద్రాస్ హైకోర్టు - బల పరీక్షలో ఓటు వేయడానికీ వీల్లేదంటూ ఆదేశం

Narahari: పోలీసుల ముందు భార్యతో లొంగిపోయిన మావో కీలక నేత పసునూరి నరహరి

స్వీపర్‌పై జర్నలిస్టు లైంగిక వేధింపులు.. ఆత్మరక్షణ కోసం నాలుకను కొరికేసింది..

717 ప్రభుత్వ టాస్మాక్ మద్యం విక్రయ కేంద్రాలు బంద్.. విజయ్ ఆదేశాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మధుమేహాన్ని అదుపులో వుంచే ఆయుర్వేద చిట్కా

ప్రాణాలు నిలబడుతున్నా... సాధారణ జీవితం కరువే

క్యారెట్లు ఎందుకు తినాలో తెలుసా?

డయాబిటీస్, ఊబకాయం పోషణ రంగంలో మరింత శక్తివంతం చేసుకున్న డాక్టర్ రెడ్డీస్, నెస్లే హెల్త్ సైన్స్

10 తాజా లేత ఆకులను నీటిలో 5 నిమిషాలు నానబెట్టి ఆ నీటిని తాగితే?

తర్వాతి కథనం
Show comments