సింగర్ రామ్ మిరియాల పాడిన టైటిల్ సాంగ్ సంతాన ప్రాప్తిరస్తు

చిత్రాసేన్
మంగళవారం, 4 నవంబరు 2025 (17:09 IST)
Vikrant, Chandini Chowdhury
రామ్ మిరియాల పాడిన పాటల్లో చిట్టి నీ నవ్వంటే లక్ష్మీ పటాసే.., టిల్లు అన్న డీజే పెడితే..', 'ఛమ్కీల అంగీలేసి..', 'ఊరు పల్లెటూరు..', 'టికెట్ ఏ కొనకుండా.., సుఫియానా... ఇలా రామ్ మిరియాల పాటలన్నీ మ్యూజిక్ లవర్స్ కు ఫేవరేట్ సాంగ్స్ అయ్యాయి. ఈ వెర్సటైల్ సింగర్ సంతాన ప్రాప్తిరస్తు సినిమా టైటిల్ సాంగ్ పాడారు. కాసర్ల శ్యామ్ లిరిక్స్ అందించిన ఈ పాటను సునీల్ కశ్యప్ కంపోజ్ చేశారు.
 
ఈ పాట ఎలా ఉందో చూస్తే - సంతాన ప్రాప్తిరస్తు, శుభమస్తు, అవిఘ్నమస్తు...సంతాన ప్రాప్తిరస్తు ఆశీర్వదిస్తూ, ఆల్ ది బెస్టు, నెత్తిన జిలకర బెల్లం పెట్టు, మంగళసూత్రం మెళ్లోన కట్టు, లక్షలు వోసి దావత్ వెట్టు, కొత్తగ వేరే కాపురమెట్టు, నీదేమో నైట్ షిఫ్టు, నీ వైఫుది మార్నింగ్ షిఫ్టు, వీకెండ్ లో రొమాన్స్ కు ప్లానింగ్ చేసి లెక్కలుగట్టు...' అంటూ ప్రస్తుత కాలంలో యూత్ మ్యారీడ్ లైఫ్ స్టైల్ ను చూపిస్తూ సాగుతుందీ పాట.
 
విక్రాంత్, చాందినీ చౌదరి జంటగా నటిస్తున్న సంతాన ప్రాప్తిరస్తు సినిమాను మధుర ఎంటర్ టైన్ మెంట్, నిర్వి ఆర్ట్స్ బ్యానర్స్ పై మధుర శ్రీధర్ రెడ్డి, నిర్వి హరిప్రసాద్ రెడ్డి నిర్మిస్తున్నారు. దర్శకుడు సంజీవ్ రెడ్డి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. రచయిత షేక్ దావూద్ జి ఈ సినిమాకు స్క్రీన్ ప్లే అందించారు. "సంతాన ప్రాప్తిరస్తు" సినిమా ఈ నెల 14న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ సినిమా నుంచి ఇప్పటిదాకా రిలీజ్ చేసిన లిరికల్ సాంగ్స్, ప్రమోషనల్ కంటెంట్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

టెలివిజన్ నటి లైంగిక వేధింపులు.. ఫ్రెండ్ రిక్వెస్ట్ కొంపముంచింది..

తనను ప్రేమించను అన్నందుకు బాలికను తుపాకీతో కాల్చిన దుండగుడు (video)

Chevireddy: అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి

గచ్చిబౌలిలో డ్రగ్స్ పార్టీ గుట్టు రట్టు చేసిన పోలీసులు - 12మంది అరెస్ట్

ఆదిలాబాద్‌లో విమానాశ్రయ అభివృద్ధి: 700 ఎకరాల భూమికి ఆమోదం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు పెరగాలనుకునేవారు ఈ 5 పదార్థాలు తింటే చాలు...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

తర్వాతి కథనం
Show comments