Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆశిష్ హీరోగా దిల్ రాజు, శిరీష్‌ నిర్మించనున్న చిత్రానికి దేత్తడి టైటిల్ ఖరారు

దేవీ
గురువారం, 1 మే 2025 (16:21 IST)
Ashish
"రౌడీ బాయ్స్ ఫేమ్ ఆశిష్ హీరోగా నటించనున్న చిత్రానికి దేత్తడి టైటిల్ ఖరారు చేశారు. నూతన దర్శకుడైన ఆదిత్య రావు గంగసాని తన క్రియేటివ్ విజన్‌ను తెరపైకి తీసుకురానున్నారు. ఈ చిత్రం హైదరాబాద్ వీధుల్లో చోటుచేసుకునే కల్చర్ తో నిండిన, భావోద్వేగంతో కూడిన అనుభూతిని ప్రేక్షకులకు అందించనుంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ప్రొడ్యూసర్స్  దిల్ రాజు , శిరీష్‌ తమ బేనర్ లో రూపొందిస్తున్న 60వ సినిమా ఇది. ఈ చిత్రం త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనుంది
 
ఆశిష్ పుట్టినరోజు సందర్భంగా చిత్ర బృందం ఈ సినిమా టైటిల్‌తో పాటు ఫస్ట్ లుక్‌ను అధికారికంగా విడుదల చేసింది. మాస్‌కు నచ్చే స్టైల్లో "దేత్తడి" అనే టైటిల్ పెట్టారు. ఇది హై ఎనర్జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ను  ప్రామిస్ చేస్తోంది.
 
ఫస్ట్ లుక్ పోస్టర్‌లో ఆశిష్ హైదరాబాద్ వీధుల్లో కనిపించే డప్పు వాద్యకారుడి గెటప్‌లో ఉత్సాహంగా కనిపిస్తున్నారు. భుజాలపై డప్పు తగిలించుకుని రెండు స్టిక్స్‌తో బలంగా మోగిస్తుండగా, మూడో స్టిక్‌ను పళ్ల మధ్యలో పట్టుకుని, అతని ముఖం మొత్తం జోష్‌తో నిండిపోయి ఉంది. అతని దుస్తులు కూడా అతని క్యారెక్టర్‌ను  ప్రజెంట్ చేస్తూ మాస్ ఫీల్‌ను ఇస్తున్నాయి.
బ్యాక్‌డ్రాప్‌లో డప్పులు మోగుతున్న గుంపు చుట్టూ జనం ఉత్సాహంగా డాన్స్ చేస్తూ సంబరాలు చేసుకుంటున్నారు. ఇది సినిమాకు ఎంత ఎనర్జీగా ఉంటుందో సూచిస్తోంది.
 
ఈ సినిమాకు సంగీతం మరో ప్రధాన బలంగా నిలవనుంది. దర్శకుడు స్వయంగా మ్యూజికల్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్నవాడు కావడంతో సినిమాలో సౌండింగ్ ఇన్నోవేటివ్ గా ఉండబోతుంది. ప్రేక్షకులకు ఒక ప్రత్యేకమైన అనుభూతిని ఇస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నమో మిసైల్ కొట్టే దెబ్బకు పాకిస్తాన్ వరల్డ్ మ్యాప్‌లో కనబడదు: నారా లోకేష్

పాకిస్థాన్ జిందాబాద్ అనే వారి కాళ్లు నిర్ధాక్షిణ్యంగా విరగ్గొట్టాలి : సీఎం హిమంత

నా కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి ఆ 13 ఏళ్ల విద్యార్థి: 23 ఏళ్ల లేడీ టీచర్ షాకింగ్ న్యూస్

Pawan Kalyan: రైతన్నలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను.. పవన్ కల్యాణ్ (video)

Aghori లేడీ కాదు, అవాక్కయ్యారా? చంచల్ గూడ జైలుకి అఘోరి శ్రీనివాస్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

స్ట్రాబెర్రీలు ఎందుకు తినాలో తెలుసా?

మల్బరీ పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

లాసోడా పండ్లు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో తెలుసా?

తర్వాతి కథనం
Show comments