Webdunia - Bharat's app for daily news and videos

Install App

హీరో విశాల్, దర్శకుడు హరి కాంబినేషన్ లో భారీ చిత్రం షూటింగ్ ప్రారంభం

Webdunia
సోమవారం, 17 జులై 2023 (10:19 IST)
Vishal, hari
'తామిరభరణి', 'పూజై' సూపర్ హిట్‌ల తర్వాత హీరో విశాల్, దర్శకుడు హరి కలసి చేస్తున్న భారీ చిత్రాన్ని స్టోన్‌బెంచ్ ఫిల్మ్స్ , జీ స్టూడియోస్ సౌత్ సంయుక్తంగా నిర్మిస్తుంది. ఇన్వెనియో ఆరిజిన్ అలంకార్ పాండియన్ ఈ చిత్రానికి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇంకా టైటిల్ పెట్టని ఈ సినిమా పూజా కార్యక్రమం తో రెగ్యులర్ షూటింగ్ గ్రాండ్ గా ప్రారంభమైయింది. చెన్నై, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లో చిత్రీకరణ జరుపుకోనుంది. ఈ చిత్రానికి స్టార్ కంపోజర్ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు. విశాల్‌కి ఇది 34వ సినిమా.
 
స్టోన్‌బెంచ్ ఫిల్మ్స్ , జీ స్టూడియోస్ సౌత్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఇన్వెనియో ఆరిజిన్ అలంకార్ పాండియన్‌ సహానిర్మాత. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రానికి ఇంకా టైటిల్ ఖరారు కాలేదు.  
 
ఇంట్రస్టింగ్ రేసీ స్క్రీన్ ప్లే తో చిత్రాలను తీయడంలో నిపుణుడు దర్శకుడు హరి. యాక్షన్‌ ప్యాక్డ్ పాత్రలు చేయడంలో విశాల్‌  పేరుపొందారు. ఇంతకుముందు వీరి కలయికలో 'పూజై', 'తామిరభరణి' చిత్రాల బ్లాక్ బస్టర్ గా నిలిచాయి. ఈ కొత్త చిత్రానికి ప్రముఖ నటీనటు, సాంకేతిక నిపుణులు పని చేస్తున్నారు.
 
ఈ చిత్రం గురించి స్టోన్‌బెంచ్ ఫిల్మ్స్ నిర్మాత కార్తికేయన్ సంతానం మాట్లాడుతూ.. విశాల్‌, హరి కాంబినేషన్‌ లో సినిమా చేయడం నిర్మాతలుగా మాకు ఎగ్జైటింగ్‌గా వుంది. ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పిస్తుందనే నమ్మకం వుంది’అన్నారు .
 
ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ ఎం. సుకుమార్, ఎడిటింగ్: టి.ఎస్. జై, ఆర్ట్ డైరెక్టర్ కాళి, ప్రేమ్‌కుమార్, స్టంట్స్ దిలీప్ సుబ్బరాయన్, సాహిత్యం వివేకా. ఆసక్తికరమైన కథాంశం, ఎక్సయిటింగ్ స్క్రీన్‌ప్లేతో రూపొందుతున్న ఈ చిత్రానికి సంబధించిన మరిన్ని వివరాలు మేకర్స్ త్వరలో తెలియజేస్తారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వన్ నేషన్-వన్ ఎలక్షన్: దేశమంతా ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తే ఎంత ఖర్చవుతుందో తెలుసా

కేటీఆర్‌ను కలవలేదు.. కనీసం ఫేస్ టు ఫేస్ చూడలేదు.. దువ్వాడ మాధురి (video)

Chain Snatching in Guntur: ఆంజనేయ స్వామి గుడి సెంటర్‌ వద్ద మహిళ మెడలో..? (video)

సంధ్య థియేటర్‌ లైసెన్స్‌ను ఎందుకు రద్దు చేయకూడదు : సీవీ ఆనంద్

కుప్పంలో పర్యటించనున్న నారా భువనేశ్వరి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter drinks శీతాకాలంలో ఆరోగ్యాన్నిచ్చే డ్రింక్స్

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

పారాసిట్మాల్ మాత్రతో తస్మాత్ జాగ్రత్త!!

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments