Webdunia - Bharat's app for daily news and videos

Install App

పుష్ప నుంచి దాక్కో దాక్కో మేక ప్రోమో: డిసెంబర్ 25న విడుదల (video)

Webdunia
గురువారం, 12 ఆగస్టు 2021 (12:16 IST)
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కలిసి పని చేస్తున్న యాక్షన్, రొమాంటిక్ డ్రామా 'పుష్ప'. ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో శరవేగంగా సాగుతోంది. మొదటి పాట 'దాక్కో దాక్కో మేక' ఆగస్టు 13న విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇది ఐదు విభిన్న భాషలలో విడుదల చేయబడుతోంది. రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ పాటను ప్రత్యేకంగా ఐదుగురు ప్రముఖ గాయకుల చేత పాడించారు. 
 
నిన్న మేకర్స్ సినిమా మొదటి భాగం 'పుష్ప : ది రైజ్' నుంచి 'దాక్కో దాక్కో మేక' ప్రోమో సాంగ్‌ను విడుదల చేశారు. ఇందులో ఆలు అర్జున్ లుక్ ను ప్రత్యేకంగా చూపించారు. 'దాక్కో దాక్కో మేక' పాట అల్లు అర్జున్‌ను అద్భుతమైన అవతారంలో ప్రదర్శించింది. పుష్పరాజ్ పాత్రను పోషిస్తున్న ఈ హీరో కత్తిని నోటిలో పెట్టుకుని పూర్తి గ్రామీణ యువకుడి లుక్‌లో కనిపిస్తున్నాడు. ఈ పాటపై హైప్ భారీగా పెరిగిపోయింది.
 
'పుష్ప'లో నేషనల్ క్రష్ రష్మిక మందన్న కథానాయికగా, మలయాళ నటుడు ఫహద్ ఫాసిల్ విలన్ పాత్రలో నటిస్తున్నారు. ఈ యాక్షన్ డ్రామాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. 'పుష్ప' నల్లమల అడవుల్లో ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే విలేజ్ డ్రామా. 
 
సుకుమార్ దర్శకత్వం వహించిన 'పుష్ప' ఆగస్టు 13న థియేటర్లలో విడుదల కావాల్సి ఉంది. కానీ సెకండ్ వేవ్ కరోనావైరస్ మహమ్మారి కారణంగా మేకర్స్ విడుదల తేదీని వాయిదా వేశారు. ఈ చిత్రం క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 25న థియేటర్లలో విడుదల కానుంది.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అరకు అభివృద్ధికి కట్టుబడి ఉన్నాను.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

భార్యాభర్తల మధ్య విభేదాలు.. 40 ఏళ్ల టెక్కీ ఆత్మహత్య.. భార్య వేధింపులే కారణమా?

వరుడి బూట్లు దాచిపెట్టిన వధువు వదిన.. తిరిగి ఇచ్చేందుకు రూ.50 వేలు డిమాండ్

పొలాల్లో విశ్రాంతి తీసుకుంటున్నారు.. నేనేమీ చేయలేను.. నారా లోకేష్ (video)

పవన్ కళ్యాణ్ కాన్వాయ్ దెబ్బ - పరీక్షకు హాజరుకాలేకపోయిన విద్యార్థులు... (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

తర్వాతి కథనం
Show comments