Webdunia - Bharat's app for daily news and videos

Install App

స‌మంత న‌టించిన `ఓ బేబీ` నిర్మాత మ‌రో సినిమాకు రెడీ

Webdunia
మంగళవారం, 31 ఆగస్టు 2021 (19:22 IST)
sunita tati- philiprjohn etc
కొరియ‌న్ న‌వ‌ల ఆధారంగా తీసిన `మిస్‌గ్రానీ` సినిమాను `ఓ బేబీ`గా సునీత తాటి తెలుగులో నిర్మించారు. స‌మంత న‌టించిన ఆ సినిమా మంచి విజ‌యాన్ని ద‌క్కించుకుంది. తాజాగా సునీత తాటి మ‌రో ప్ర‌యోగాన్ని చేస్తున్నారు. టైమెరి మురారి ర‌చించిన అరేంజ్‌మెంట్స్ ఆఫ్ లవ్ న‌వ‌ల ఆధారంగా తెలుగులో మ‌రో ప్ర‌య‌త్నం చేస్తున్నారు. త‌న తండ్రికోసం వెతికే క్ర‌మంలో ఇండియా వ‌చ్చే కొడుకు క‌థ‌తో ఈ సినిమా రూపొంద‌బోతోంది.
 
తన తల్లి, సవతి తండ్రితో కలిసి అమెరికాలో నివసించే నిఖిల్ అనే అబ్బాయి కథను ఈ న‌వ‌ల చెబుతుంది. అతని తల్లి, సుష్మా అకా సూసీ (అమెరికాలో) అనుకోని స్థితిలో చ‌నిపోతుంది. అనంత‌రం తన నిజమైన తండ్రిని కనుగొనడానికి నిఖిల్ ఇండియాకు వెళ్లాలనే నిర్ణయంతో ఈ నవల మొదలవుతుంది- అతను ఇండియా వ‌స్తాడు. త‌ను అనుకున్నది సాధించాడా!లేదా! అనేది మిగిలిన క‌థ‌.
 
మంగ‌ళ‌వారంనాడు ఈ చిత్రం గురించి నిర్మాత ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. గురు ఫిలిం ప్రొడ‌క్ష‌న్స్‌పై రూపొంద‌నున్న ఈ సినిమాకు ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం ఫిలిప్రోజోన్ వ‌హిస్తున్నారు. ఇందులో త‌ల్లి పాత్ర‌, కొడుకు పాత్ర ఎవ‌ర‌నేది త్వ‌ర‌లో వెల్ల‌డిస్తాన‌ని పేర్కొన్నారు. దీనికి స‌హ ర‌చ‌న నిమ్మిహరసాగమ.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కృష్ణానది ఒడ్డున భారీ క్రీడా నగరం.. పెదలంక - చిన్నలంక గ్రామాల పరిసరాల్లో..?

హైదరాబాద్‌లో గ్లోబల్ కెపబిలిటీ సెంటర్‌: కాగ్నిజెంట్‌తో సిటిజన్స్ ఫైనాన్షియల్ గ్రూప్ భాగస్వామ్యం

ఆర్థిక వృద్ధి రేటు.. రెండో స్థానానికి చేరిన ఆంధ్రప్రదేశ్.. చంద్రబాబు హర్షం

మద్యం కుంభకోణం- రూ.18,860 కోట్ల నష్టం: విజయసాయి రెడ్డికి నోటీసులు జారీ

అలా చేస్తే పాఠశాలల గుర్తింపు రద్దు చేస్తామంటున్న ఢిల్లీ సీఎం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

తర్వాతి కథనం
Show comments