Webdunia - Bharat's app for daily news and videos

Install App

శివాoశు హీరోగా సినిమా ప్రారంభం

Webdunia
బుధవారం, 14 ఏప్రియల్ 2021 (18:15 IST)
Sivamsu hero movie opening
నూత‌న న‌టుడు 'శివాoశు'ను హీరోగా పరిచయం చేస్తూ ఆర్.వి.జీ మూవీజ్,ఎస్.వి.ఎల్.ఎంట్రప్రైజస్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం హైద్రాబాద్, సత్యసాయి నిగమాగమంలోని వినాయకుని గుడిలో మొదలైంది. రవిశంకర్ ఓంకాలి-తలారి వినోద్ కుమార్ ముదిరాజ్-శ్రీనివాస్ మామిడాల-లలిత్ కుమార్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి రుద్రాపట్ల వేణుగోపాల్ (ఆర్.వి.జి) దర్శకత్వం వహిస్తున్నారు. ప్రాచీరాయ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రముఖ హీరోయిన్ ఆమని ముఖ్యపాత్ర పోషిస్తున్నారు.
 
దైవ సన్నిధిలో దేవుని పటాలపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి ఈ చిత్రానికి మాటలు-పాటలు రాస్తున్న ప్రముఖ రచయిత వి.ఎస్.పి.తెన్నేటి కెమెరా స్విచాన్ చేయగా శ్రీమతి స్వాతి రుద్రాపట్ల క్లాప్ కొట్టారు. పూజా కార్యక్రమాలు అనంతరం రెగ్యులర్ షూట్ ప్రారంభించారు. 
 
అనంతరం దర్శకనిర్మాత రుద్రాపట్ల వేణుగోపాల్ మాట్లాడుతూ, నా ప్రతి సినిమాలోనూ కొత్తవారిని పరిచయం చేస్తున్నాను. ఇంకా పేరు పెట్టని ఈ చిత్రంలో అత్యంత ప్రతిభతోపాటు మంచి ఫైర్ ఉన్న కుర్రాడ్ని హీరోగా పరిచయం చేస్తున్నాను" అన్నారు. మ‌రిన్ని వివ‌రాలు త్వ‌ర‌లో తెలియ‌జేస్తామ‌ని తెలిపారు.
రచయిత వి.ఎస్.పి.తెన్నేటి, హీరో శివాoశు, హీరోయిన్ ప్రాచీ రాయ్, నిర్మాతలు రవిశంకర్ ఓంకాలి- తలారి వినోద్ కుమార్ ముదిరాజ్- శ్రీనివాస్ మామిడాల-లలిత్ కుమార్ సంగీత దర్శకుడు రాజేష్ రాజ్.టి, కెమెరామెన్ ప్రసాద్ కె.నాయుడు, ఈ చిత్రంలో కీలక పాత్రధారి ఆకెళ్ల పాల్గొని చిత్ర విశేషాలు వెల్లదించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

EVM లపై సుప్రీంకోర్టు కీలక తీర్పు, మీరు గెలిస్తే ట్యాంపరింగ్ కాదా అంటూ ప్రశ్న

ఒకే ఒక్క విద్యార్థిని... పాఠశాల యేడాది ఖర్చు రూ.12.48 లక్షలు (Video)

శని శింగ్నాపూర్‌లో శని భగవానుడి చుట్టూ పిల్లి ప్రదక్షిణలు (video)

ఆంధ్రప్రదేశ్‌కు భారీ వర్ష సూచన : ఒకటో నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ

జగన్‌ను జీవితాంతం జైల్లోనే ఉంచాలి : వైకాపా కార్యకర్త పచ్చిబూతులు (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments