Webdunia - Bharat's app for daily news and videos

Install App

నివేదా థామస్.. హైదరాబాదులో ఇల్లు కొనబోతుందట..

Niveda thomas
Webdunia
గురువారం, 27 జూన్ 2019 (18:37 IST)
దక్షిణాది సినీ పరిశ్రమలో పెర్ఫామెన్స్ విషయంలో మోస్ట్ టాలెంటెడ్ హీరోయిన్లలో నివేదా థామస్ ఒకరు. కొన్ని సినిమాలలో ఆమె ఫెర్ఫార్మెన్స్ చాలా బాగుండటం వలన సక్సెస్ బాట పట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఆమె హీరోయిన్‌గా నటించిన నిన్ను కోరి, జెంటిల్‌మెన్, జై లవకుశ సినిమాలలో ఆమె నటనకు మంచి పేరు వచ్చింది. 
 
తాజాగా ఆమె నటించిన చిత్రం బ్రోచేవారెవరురా సినిమా జూన్ 28న రిలీజ్ కానున్న నేపథ్యంలో మీడియాతో నివేదా ముచ్చటించారు. ఈ సినిమాకు మెంటల్ మదిలో ఫేం వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్నారు.
 
బ్రోచేవారెవరురా సినిమా ప్రస్తుత సామాజిక పరిస్థితులను ప్రతిబింబించే విభిన్నమైన కథ. సమాజంలో ఉన్న రకరకాల వ్యక్తుల మనస్తత్వాన్ని తెలిపే సినిమా ఇది. ఈ సినిమాలో నా పాత్ర పేరు మిత్ర. మానసికంగా శక్తివంతంగా ఉండే యువతి పాత్రలో నేను నటించాను. ఇందులో తండ్రి, కూతుళ్ల మధ్య ఎమోషనల్‌గా కథ సాగుతుందని నివేదా థామస్ చెప్పారు. 
 
జెంటిల్మన్ సినిమా తర్వాత ఎక్కువగా తెలుగు సినిమాలలోనే కనిపిస్తున్న నివేదా తమిళ, మలయాళ చిత్రాలకు కొంత దూరంగానే ఉంటున్నారు. జెంటిల్‌మెన్ సినిమాలో డబ్బింగ్ చెప్పాలని ఆశపడ్డాను కానీ నాకు పరీక్షలు ఉండటం వల్ల చెప్పలేకపోయాను. 118తో ఆ కోరిక నెరవేరిందని చెప్పారు నివేద. తెలుగులో ఎక్కువగా నటించడానికి ప్రత్యేకమైన కారణాలు ఏమీ లేవు కానీ ఇక్కడ అవకాశాలు ఎక్కువగా రావడంతో సెటిల్ అయ్యాను, త్వరలో హైదరాబాద్‌లో ఇల్లు కొనాలని చూస్తున్నానని చెప్పుకొచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హైదరాబాద్‌లో దంచికొట్టిన వర్షం ... పిడుగుపాటుకు ఇద్దరు మృతి (Video)

వివేకా కుమార్తె సునీతను ఏమైనా చేస్తారనే భయం ఉంది : వైఎస్ షర్మిల

బోయ్ ఫ్రెండ్ కౌగిలించుకోలేదని 14 అంతస్తుల కాలేజీ భవనం పైనుంచి దూకేసిన యువతి

అమరావతికి శుభవార్త చెప్పిన ప్రపంచ బ్యాంక్ - తొలి విడతగా రూ.3535 కోట్లు రిలీజ్

జాతీయ ఉపాధి హామీ పథకం లబ్దిదారుల జాబితాలో షమీ సోదరి పేరు!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments