కన్నడంలోకి రామ్‌చరణ్ రంగస్థలం..

Webdunia
గురువారం, 27 జూన్ 2019 (17:45 IST)
గత ఏడాది విడుదలై రామ్ చరణ్ ఖాతాలో భారీ హిట్‌ని చేరవేసిన రంగస్థలం కన్నడ భాషలోకి వెళ్లనుంది. డబ్బింగ్‌తో సహా ఇతర కార్యక్రమాలు పూర్తి చేసి వచ్చే నెల విడుదల చేయబోతున్నారు.


ఆడియో ఇప్పటికే హిట్ కాగా, నిన్న విడుదలైన టీజర్‌కి కూడా మంచి రెస్పాన్స్ వస్తోంది. రామ్ చరణ్ తెలుగులో సౌండ్ ఇంజనీర్ చిట్టిబాబుగా రచ్చ చేసిన పాత్రకు కన్నడలో కిట్టిగా పేరు పెట్టారు. 
 
ఈ పాత్రను పరిచయం చేస్తూ టీజర్ వదలడంతో వైరల్ అవుతోంది. కన్నడలో దశాబ్దాలుగా ఉన్న డబ్బింగ్ ఆంక్షలను ఇటీవలే ఎత్తేసిన సంగతి తెలిసిందే. అందుకే సౌత్‌లో రూపొందుతున్న క్రేజీ సినిమాలన్నింటినీ అక్కడ డబ్ చేస్తూ నిర్మాతలు అదనపు ఆదాయాన్ని పొందుతున్నారు. ఈ క్రమంలోనే రంగస్థలకు సైతం మంచి ఆదరణ దక్కుతుందనే భారీ అంచనాలతో విడుదలను ప్లాన్ చేస్తున్నారు. 
 
సాధారణంగా గ్రామీణ భౌగోళిక ప్రాంతం ఎక్కువగా ఉండే కర్ణాటకలో దీనికి మంచి స్పందన వస్తుందని అంచనాలు ఉన్నాయి. పైగా మెగా ఫ్యాన్స్ బేస్ ఎక్కువగా ఉండే కన్నడ రాష్ట్రంలో తమ స్వంత భాషలో రామ్ చరణ్ సినిమా వస్తోంది అంటే రచ్చ మామూలుగా ఉండబోదు. అందుకే దానికి తగ్గట్టే హైప్ కూడా ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

గూగుల్ కమ్స్ టు ఏపీ : సీఎం చంద్రబాబు పోస్ట్

Google To AP: విశాఖలో గూగుల్ 1-జీడబ్ల్యూ డేటా సెంటర్‌.. ఆ ఘనత బాబు, లోకేష్‌ది కాదా?

ఉచిత బస్సు పథకంతో ఆర్టీసీ ఇక్కట్లు.. చంద్రబాబు సర్కారు ఆ సమస్యను పరిష్కరిస్తుందా?

రాజకీయాల్లోకి వచ్చాక ఆదాయం తగ్గిపోయింది .. ఖర్చులు పెరిగాయి : కంగనా రనౌత్

అమరావతిలో దేశంలోనే అతిపెద్ద రైల్వే స్టేషన్ - 24 ప్లాట్‌ఫారమ్‌లు, నాలుగు టెర్మినల్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

హృద్రోగుల్లో అత్యధిక శాతం 50 ఏళ్ల లోపువారే: టాటా ఏఐజీ సర్వేలో వెల్లడి

సూపర్ ఫుడ్ క్వినోవా తింటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

ఆయుర్వేదం ప్రకారం నిలబడి మంచినీళ్లు తాగితే ఏమవుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments