Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలీవుడ్‌లో అలాంటి వారా? ముందు పడకగదికి.. ఆపై ఆర్థిక ఇబ్బందులు.. కంగనా ఎంట్రీ?

హేట్ స్టోరీ ఫేమ్, దర్శకనిర్మాత వివేక్ అగ్నిహోత్రి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం బాలీవుడ్‌లో వివాదానికి దారితీశాయి. బాలీవుడ్‌‍లోనే మహిళలు మాత్రమే కాకుండా పురుషులు కూడా లైంగిక వేధింపులకు గురవుతున్నారని వివే

Webdunia
మంగళవారం, 13 మార్చి 2018 (13:38 IST)
హేట్ స్టోరీ ఫేమ్, దర్శకనిర్మాత వివేక్ అగ్నిహోత్రి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం బాలీవుడ్‌లో వివాదానికి దారితీశాయి. బాలీవుడ్‌‍లోనే మహిళలు మాత్రమే కాకుండా పురుషులు కూడా లైంగిక వేధింపులకు గురవుతున్నారని వివేక్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. అలాంటి వారి బండారం బయటపెట్టాలంటే.. బోల్డ్ హీరోయిన్ కంగనా రనౌత్ వంటి వారే ముందుకు రావాలని పిలుపునిచ్చారు. 
 
బాలీవుడ్‌లో పురుషులను లైంగిక వేధించే వారిపై పోరాడేందుకు ఎవ్వరికీ ధైర్యం లేదని వివేక్ తెలిపాడు. ఇంకా తన ట్విట్టర్ ఖాతాలో తన బంధువుల అబ్బాయి ఇటీవల బాలీవుడ్‌లో నటించేందుకు అమెరికా వచ్చాడని, అతనిని స్టార్ హీరో, దర్శకనిర్మాతకు పరిచయం చేశానని తెలిపాడు. ఆ దర్శక నిర్మాతలు అతనిని లైంగికంగా వేధింపులకు గురిచేశారని చెప్పుకొచ్చారు. 
 
సినిమా అవకాశం కోసం వస్తే ముందు పడకగదికి రమ్మంటారని.. అది కాదంటే ఆర్థికంగా ఇబ్బందులకు గురిచేస్తారని.. రెండూ కుదరకపోతే.. అవకాశమిచ్చి ఊడిగం చేయించుకుంటారని వివేక్ అగ్నిహోత్రి ఆరోపణలు చేశాడు. ఇలాంటి చర్యల ద్వారా ''మీ టూ'' ఉద్యమం కేవలం స్త్రీలకు మాత్రమే పరిమితం కాకూడదని.. పురుషులు కూడా అందులో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చాడు.
 
బాలీవుడ్‌లోనూ హర్వే వెయిస్టీన్‌లను వెలికితీస్తే అగ్రహీరోలతో పాటు దర్శకులు కూడా బయటపడతారని.. అలాంటి వారి చేతుల్లో తన బంధువు నలిగిపోయాడని తెలిపారు. బాలీవుడ్‌లో అడుగు పెట్టేవారిపై లైంగిక, ఆర్థిక, అధికారం అండతో వేధింపులకు దిగుతున్నారని వివేక్ అగ్నిహోత్రి చెప్పుకొచ్చాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Deputy CM ట్రెండ్, 10 వేల మంది జీవితాలు పోతాయ్ అంటారా? సీజ్ ది షిప్ అంటూ పవన్ కల్యాణ్

రోడ్డుపై వెళ్తున్న వ్యక్తిపై గాడిద దాడి.. కాలికి తీవ్రగాయం వీడియో వైరల్

నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం... ఆ రెండు పోర్టులకు ప్రమాద హెచ్చరికలు

పోర్టులోకి రైస్ ఎలా వస్తుంది? డిప్యూటీ సీఎం అయిన నాకే సహకారం లేదు: పవన్ విస్మయం (video)

వైనాట్ 175 అన్నారు.. చివరకు 11 వచ్చాయి.. అయినా మార్పు రాలేదు : జగన్‌పై బాలినేని ఫైర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం