Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైకల్యాన్ని జయించిన వీరుడు పొట్టి వీరయ్య: రాజశేఖర్, జీవిత

Webdunia
సోమవారం, 26 ఏప్రియల్ 2021 (18:00 IST)
Jeevia rajsekar, potti verraya house
తెలుగు చిత్ర పరిశ్రమ ఓ అరుదైన నటుడిని కోల్పోయింది. పొట్టి వీరయ్యగా ప్రేక్షకులకు తెలిసిన గట్టు వీరయ్య ఆదివారం గుండెపోటుతో తుదిశ్వాస విడిచిన విషయం విధితమే. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో 500లకు పైగా సినిమాల్లో నటించిన వీరయ్యకు ప్రముఖ కథానాయకుడు రాజశేఖర్, జీవిత దంపతులు నివాళులు అర్పించారు. చిత్రపురి కాలనీకి వెళ్లి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి, సానుభూతి వ్యక్తం చేశారు. వీరయ్యతో తమకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.
 
రాజశేఖర్, జీవిత దంపతులు మాట్లాడుతూ "వీరయ్యగారు తెలియని వాళ్ళు లేరు. అగ్ర హీరోలు అందరితోనూ నటించారు. మాతోనూ ఎన్నో సినిమాల్లో నటించారు. మాకు ఎప్పటి నుంచో పరిచయం. ఆయన వైకల్యాన్ని జయించిన వీరుడు. తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు.

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) జనరల్ బాడీ మీటింగ్స్ కానివ్వండి, అవార్డు ఫంక్షన్స్ కానివ్వండి ఏ కార్యక్రమానికి పిలిచినా సరే తప్పకుండా హాజరు అయ్యేవారు. ఎప్పుడూ నవ్వుతూ, నవ్విస్తూ ఉంటారు. మేం పరిశ్రమలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు పరిశ్రమలో ఉన్నారు. అందరికీ అందుబాటులో ఉన్నారు. ఆయన మరణం బాధ కలిగించింది. ఆ కుటుంబానికి మాకు వీలైనంత సహాయం చేయాలని అనుకుంటున్నాం"  అని అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

టాయిలెట్‌ పిట్‌లో ఇరుక్కుపోయిన నవజాత శిశువు మృతదేహం.. ఎక్కడ?

ప్రజలు చిత్తుగా ఓడించినా జగన్‌కు ఇంకా బుద్ధిరాలేదు : మంత్రి సత్యకుమార్

కానిస్టేబుల్ కర్కశం... కన్నతల్లిని కొట్టి చంపేశాడు..

ప్రధాని మోడీ భద్రతా వలయంలో లేడీ కమాండో...!!

బాలానగర్ సీతాఫలంకు భౌగోళిక గుర్తింపు!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

తర్వాతి కథనం
Show comments