Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరువీర్ హీరోగా ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో లాంఛ‌నంగా ప్రారంభం

డీవీ
గురువారం, 10 అక్టోబరు 2024 (21:12 IST)
Clap by Rana
వైవిధ్య‌మైన పాత్ర‌ల‌తో గుర్తింపు సంపాదించుకున్న తిరువీర్ క‌థానాయ‌కుడిగా కొత్త సినిమా ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ హైదరాబాద్‌లో లాంఛ‌నంగా ప్రారంభ‌మైంది. బై 7పి.ఎంప్రొడ‌క్ష‌న్స్, ప‌ప్పెట్ షో ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్స్‌పై రాహుల్ శ్రీనివాస్ ద‌ర్శ‌క‌త్వంలో సందీప్ అగ‌రం, అష్మితా రెడ్డి ఈ మూవీని నిర్మిస్తున్నారు. క‌మిటీ కుర్రోళ్ళు ఫేమ్ టీనా శ్రావ్య క‌థానాయిక‌. ముహూర్తం స‌న్నివేశానికి రానా ద‌గ్గుబాటి క్లాప్ కొట్టగా, సందీప్ అగ‌రం కెమెరా స్విచ్ ఆన్ చేశారు. రాహుల్ శ్రీనివాస్ గౌర‌వ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.
 
ఈ సంద‌ర్భంగా నిర్మాత‌లు సందీప్ అగ‌రం, అష్మితా రెడ్డి మాట్లాడుతూ ‘‘మా ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’  సినిమాను స‌పోర్ట్ చేయ‌టానికి ఇక్క‌డ‌కు వ‌చ్చిన రానాగారికి, ఇత‌ర సినీ పెద్ద‌లు, ప్ర‌ముఖులకు మ‌న‌స్ఫూర్తిగా ధ‌న్య‌వాదాల‌ను తెలియ‌జేస్తున్నాను. కామెడీ డ్రామా జోన‌ర్‌లో సినిమాను రూపొందిస్తున్నాం. ద‌ర్శ‌కుడు రాహుల్ శ్రీనివాస్ కొత్త పాయింట్‌తో సినిమాను తెర‌కెక్కిస్తున్నారు. నవంబర్ 7 నుంచి రెగ్యులర్ షూటింగ్‌ను స్టార్ట్ చేస్తున్నాం. హీరో తిరువీర్‌గారికి థాంక్స్‌’’ అన్నారు.
 
ద‌ర్శ‌కుడు రాహుల్ శ్రీనివాస్ మాట్లాడుతూ ‘‘‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ సినిమా కామెడీ డ్రామా మూవీగా అలరించనుంది. నవంబర్ 7 నుంచి ఎస్‌.కోట‌, వైజాగ్ ప్రాంతాల్లో చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుప‌బోతున్నాం. అవ‌కాశం ఇచ్చిన హీరో తిరువీర్‌గారికి, నిర్మాత‌లు సందీప్ అగ‌రం, అష్మితారెడ్డిగారికి ధ‌న్య‌వాదాలు’’ అన్నారు.
నటీనటులు: తిరువీర్‌, టీనా శ్రావ్య, రోహ‌న్ రాయ్‌, న‌రేంద్ర త‌దిత‌రులు

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నానికి షాకిచ్చిన కోర్టు

జనసేన సంస్థాగత బలోపేతం కోసం త్రిశూల్ వ్యూహం : పవన్ కళ్యాణ్

బీహార్‌లో ఒక్క ఓటు కూడా చోరీ కానివ్వం : రాహుల్ గాంధీ

యూపీఎస్పీ అభ్యర్థుల కోసం ప్రతిభా సేతు పోర్టల్

ఏలూరు జిల్లాలో కానిస్టేబుల్‌ అదృశ్యం.. ఫోన్‌ సిగ్నల్‌ కట్‌!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

డయాబెటిస్ వున్నవారిలో చాలామందికి కిడ్నీలు పాడైపోవడానికి కారణాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments