సూపర్‌స్టార్ రజినీకాంత్ టైటిల్ పాత్రలో నటించిన చిత్రం వేట్టయన్- ద హంటర్.టి.జె.జ్ఞానవేల్ దర్శకత్వం వహించారు. ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. సుభాస్కరన్ నిర్మాత. దసరా సందర్భంగా అక్టోబర్ 10న వేట్టయన్ ద హంటర్‌ని రిలీజ్ చేయనున్నారు. ఈ నేపథ్యంలో వేట్టయన్- ద హంటర్ ట్రైలర్‌ని విడుదల చేశారు మేకర్స్. ఇన్‌స్టంట్‌గా సూపర్‌హిట్ టాక్ తెచ్చుకుంది ట్రైలర్.
`ఖైదు చెయ్ ఖైదు చెయ్... నేరస్తుడిని ఖైదు చెయ్.. ఖైదు చెయ్ ఖైదు చెయ్... నేరస్తుడిని ఖైదు చెయ్` అంటూ మొదలవుతుంది వేట్టయన్ - ద హంటర్ ట్రైలర్.
ఈ దేశంలో ఆడపిల్లలకు భద్రత లేదు. కానీ, పోరంబోకులకు బాగా భద్రత ఉంది.
ఇలాంటి మగ మృగాలను ఎన్‌కౌంటర్‌లో చంపేయాలి` అని ట్రైలర్‌లో వినిపించే డైలాగులతో అక్కడ జరిగిన విషయమేంటో సగటు ప్రేక్షకుడికి ఇట్టే అర్థమైపోతుంది. `నేరస్తుడిని వెంటనే పట్టుకోవాలి. అందుకు ఏ యాక్షన్ అయినా తీసుకోండి.... ఇట్ వాజ్ ఎ బ్రూటల్ మర్డర్ సార్...
ఇంత పెద్ద పోలీస్ ఫోర్స్, వెపన్స్, పవర్ అన్నీ ఉండి క్రిమినల్ అట్రాసిటీస్ జరుగుతున్నాయంటే అక్కడ పోలీసులు సరిగ్గా పనిచేయట్లేదని అర్థం. ఊరికే మాట్లాడి ప్రయోజనం లేదు.. వాడిని లేపేద్దాం. గాట్ ఇట్..
యస్ సార్.. `...
ఈ మాటలన్నీ మళ్లీ ప్రేక్షకుడిని కథలోకి తీసుకెళ్తాయి. చకచకా జరుగుతున్న సన్నివేశాలను కళ్లకు కట్టినట్టు అనిపిస్తాయి. అక్కడి వాతావరణం ఎంత వేడిగా ఉందో చెప్పడానికి ఇంతకన్నా మాటలు అక్కర్లేదన్నట్టు కట్ చేశారు ట్రైలర్‌ని.
ఇంత హీట్‌ని కూల్ చేసేలా ఉన్నాయి ట్రైలర్‌లో అమితాబ్ డైలాగులు..
2.0, దర్బార్, లాల్ సలామ్ వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాల తర్వాత రజినీకాంత్, లైకా ప్రొడక్షన్స్ కలయికలో రాబోతున్న సినిమా వేట్టయన్ ద హంటర్. అలాగే పేట, దర్బార్, జైలర్ చిత్రాలకు పుట్ ట్యాపింగ్ ట్యూన్స్ అందించి మెప్పించిన మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచందర్... రజనీకి నాలుగోసారి సంగీతం అందించిన సినిమా కావటంతో వేట్టయన్- ద హంటర్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
రజినీకాంత్ టైటిల్ పాత్రలో నటించిన వేట్టయన్- ద హంటర్ చిత్రంలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కీలక పాత్ర పోషించారు. ఈ చిత్రంలో మంజు వారియర్, ఫాహద్ ఫాజిల్, రానా దగ్గుబాటి, రితికా సింగ్, దుషారా విజయన్, రోహిణి, అభిరామి తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటించారు. ఆడియెన్స్‌కు సరికొత్త సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్‌ను ఇవ్వటానికి సిద్ధమవుతోన్న ఈ పాన్ ఇండియా సినిమా తమిళ, తెలుగు, హిందీ, కన్నడ భాషల్లో రిలీజ్ కానుంది.
నటీనటులు: సూపర్‌స్టార్ రజినీకాంత్, అమితాబ్ బచ్చన్, మంజు వారియర్, ఫాహద్ ఫాజిల్, రానా దగ్గుబాటి, రోహిణి, అభిరామి, రితికా సింగ్, దుషారా విజయన్ తదితరులు
నటీనటులు:బ్యానర్: లైకా ప్రొడక్షన్స్ సుభాస్కరన్, దర్శకత్వం: టి.జె.జ్ఞానవేల్, మ్యూజిక్: అనిరుద్ రవిచందర్, సినిమాటోగ్రఫీ: ఎస్.ఆర్.కదిర్, ఎడిటర్: ఫిలోమిన్ రాజ్, ప్రొడక్షన్ డిజైన్: కె.కదిర్, యాక్షన్: అన్బరివు, కొరియోగ్రఫీ: దినేష్, పి.ఆర్.ఒ: నాయుడు సురేంద్ర కుమార్- ఫణి కందుకూరి (బియాండ్ మీడియా).