Webdunia - Bharat's app for daily news and videos

Install App

రవితేజ పుట్టినరోజున రావణాసుర ఫస్ట్ గ్లింప్స్ రాబోతుంది

Webdunia
మంగళవారం, 24 జనవరి 2023 (16:12 IST)
Ravanasura team
రవితేజ ధమాకా, వాల్తేరు వీరయ్య సినిమాల సక్సెస్‌ తో దూసుకెళ్తున్నారు. ప్రస్తుతం రవితేజ, క్రియేటివ్ డైరెక్టర్ సుధీర్ వర్మ దర్శకత్వంలో తన తాజా చిత్రం ‘రావణాసుర’ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఈ యూనిక్ యాక్షన్ థ్రిల్లర్ రవితేజ ఆర్ టి టీమ్‌వర్క్స్, అభిషేక్ నామా అభిషేక్ పిక్చర్స్ నిర్మాణంలో గ్రాండ్‌గా రూపొందుతోంది. సుశాంత్ కీలక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో  అను ఇమ్మాన్యుయేల్, మేఘా ఆకాష్, ఫరియా అబ్దుల్లా, దక్షా నాగర్కర్, పూజిత పొన్నాడ.. కథానాయికలుగా నటిస్తున్నారు.  
 
జనవరి 26న రవితేజ పుట్టినరోజు జరుపుకోనున్న సంగతి తెలిసిందే. ఈ ప్రత్యేక సందర్భంలో ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్ ని మేకర్స్ విడుదల చేయనున్నారు. ఇప్పటికే రవితేజ ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ ను విడుదల చేయగా దానికి అద్భుతమైన స్పందన వచ్చింది.
 
సుధీర్ వర్మ ఈ సినిమాలో రవితేజను లాయర్ పాత్రలో మునుపెన్నడూ చూడని విధంగా హై యాక్షన్‌ లో ప్రజంట్ చేస్తున్నారు. శ్రీకాంత్ విస్సా ఈ చిత్రానికి సరికొత్త కథని అందించారు.  సుధీర్ వర్మ తన మార్క్ టేకింగ్‌తో ఈ చిత్రాన్ని కథనంలో  ఊహించని మలుపులతో స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిస్తున్నారు.
 
 హర్షవర్ధన్ రామేశ్వర్,  భీమ్స్ కలిసి ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా, విజయ్ కార్తీక్ కన్నన్ సినిమాటోగ్రఫీ, శ్రీకాంత్ ఎడిటర్ గా పని చేస్తున్నారు. ఏప్రిల్ 7, 2023న వేసవిలో రావణాసుర థియేటర్స్ లో గ్రాండ్‌ గా విడుదల కానుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అక్కకి పెళ్లైందని బావ ఇంటికెళితే... మరదలిపై 7 ఏళ్లుగా అత్యాచారం

ప్రపంచంలోనే ప్రమాదకరమైంది కింగ్ కోబ్రా కాదు.. నత్త.. తెలుసా?

ఈ మోనాలిసాకి ఏమైంది? కన్నీటి పర్యంతమై కనిపిస్తోంది (video)

వాట్సప్ ద్వారా వడ్లు అమ్ముకుంటున్న ఆంధ్ర రైతులు, గంటల్లోనే డబ్బు

అనంత్ అంబానీ 141 కిలోమీటర్లు కాలినడకన ద్వారక చేరుకుంటారా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments