Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాహుబ‌లి ప్ర‌భాక‌ర్ ప్ర‌ధాన పాత్ర‌లో చిత్రం ప్రారంభం

Webdunia
గురువారం, 7 ఏప్రియల్ 2022 (15:43 IST)
Bahubali Prabhakar, sowjanya, Shailaja
పాలిక్ ద‌ర్శ‌క‌త్వంలో రావుల ర‌మేష్ నిర్మాత‌గా `బాహుబ‌లి` ప్ర‌భాక‌ర్, ష‌క‌ల‌క శంక‌ర్  ప్ర‌ధాన పాత్ర‌ల్లో ఓ చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రం ప్రారంభోత్స‌వ కార్య‌క్రమం ఈ రోజు ఫిలింన‌గ‌ర్ దైవ స‌న్నిధానంలో జ‌రిగింది.  ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిలుగా విచ్చేసిన ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు, న‌టుడు, ద‌ర్శ‌కుల సంఘం అధ్య‌క్షులు వై కాశీ విశ్వ‌నాథ్ ముహూర్త‌పు స‌న్నివేశానికి క్లాప్ ఇవ్వ‌గా ఫిలిం చాంబ‌ర్ సెక్ర‌ట‌రీ ప్ర‌స‌న్న కుమార్ కెమెరా స్విచాన్ చేశారు.
 
అనంత‌రం బాహుబ‌లి ప్ర‌భాక‌ర్ మాట్లాడుతూ, రిటైర్డ్ ఆర్మీ ఆఫీస‌ర్ జీవితంలో ఓ రాత్రి ఏం జ‌రిగింది అనేది క‌థాంశం. రెండేళ్ల క్రితం డైర‌క్ట‌ర్ పాలిక్  ఈ క‌థ‌తో క‌లిశారు. క‌రోన వ‌ల్ల అప్పుడు కుద‌ర్లేదు.  ప‌ట్టు వ‌ద‌ల‌ని విక్ర‌మార్కుడిలాగా మ‌ళ్లీ పాలిక్  ఈ ప్రాజెక్ట్ ప‌ట్టాలెక్కిస్తున్నారు. ఇందులో నేను హీరో అని చెప్ప‌ను కానీ సినిమాకు ఎంతో కీల‌క‌మైన పాత్ర‌లో న‌టిస్తున్నా అన్నారు.
 
నిర్మాత రావుల ర‌మేష్ మాట్లాడుతూ,  ద‌ర్శ‌కుడు పాలిక్ చెప్పిన క‌థ నాకు బాగా న‌చ్చింది. ఎక్క‌డా రాజీ ప‌డ‌కుండా సినిమాను నిర్మించ‌డానికి ప్లాన్  చేస్తున్నాం. మా ప్ర‌య‌త్నాన్ని ప్రేక్ష‌కులు ఆశీర్వదిస్తార‌ని కోరుకుంటున్నా అన్నారు.
 
క‌థా ర‌చ‌యిత వింధ్యా రెడ్డి మాట్లాడుతూ, పాలిక్ గారు  నా గురువు. ఆయ‌న ద‌గ్గ‌ర మూడేళ్లుగా రైట‌ర్‌గా  శిష్య‌రికం చేస్తున్నాను. ఈ క్ర‌మంలో ఈ క‌థ రెడీ చేసి చెప్పాను. వారికి న‌చ్చ‌డంతో ఇది కార్య‌రూపం దాల్చుతోంది. నాకు ఈ అవ‌కాశం క‌ల్పించిన ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కు ధ‌న్య‌వాదాలు`` అన్నారు.
 
ద‌ర్శ‌కుడు పాలిక్ మాట్లాడుతూ, ఇదొక స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ క‌థాంశంగా మలిచి తెర‌కెక్కిస్తున్నాం.  ఒక మేజ‌ర్ జీవితంలో ఒక నైట్ ఏం జ‌రిగింది అనేది సినిమా స్టోరి. బాహుబ‌లి ప్ర‌భాక‌ర్ ఇందులో కొత్త కోణంలో... డ్యూయ‌ల్ షేడ్ లో చూస్తారు. ఇందులో మూడు పాట‌లున్నాయి. జాన్ గారు అద్భుత‌మైన ట్యూన్స్ ఇచ్చారు. అదే స్థాయిలో సురేష్ గంగుల సాహిత్యాన్ని స‌మ‌కూర్చారు. నాగిరెడ్డి ఎడిటింగ్, మ‌ల్లిక్ సినిమాటోగ్ర‌ఫీ ఇలా టెక్నిక‌ల్ టీమ్ అంతా ఎంతో బాగా కుదిరింది.  ఈ నెలాఖ‌రులో షెడ్యూల్ ప్రారంభిస్తాం. తొలి షెడ్యూల్ గోవాలో రెండో షెడ్యూల్ హైద‌రాబాద్, అర‌కులో చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నాం. మా ప్ర‌య‌త్నాన్ని ప్రేక్ష‌కులు ఆద‌రిస్తార‌ని ఆశిస్తున్నాం అన్నారు.
 
సంగీత ద‌ర్శ‌కుడు జాన్ భూష‌ణ్ మాట్లాడుతూ...``మంచి పాట‌లు రావ‌డానికి ఎంతో హార్డ్ వ‌ర్క్ చేస్తున్నాం. ఇప్ప‌టికే రెండు పాట‌లు కంపోజింగ్ పూర్త‌యింది.  డైర‌క్ట‌ర్  పాలిక్ గారు ఇచ్చిన ఫ్రీడ‌మ్ వ‌ల్ల మంచి పాట‌లు వ‌స్తున్నాయి`` అన్నారు.
చ‌ల‌ప‌తి రావు, సుధ‌, జీవా, సౌజ‌న్య‌, శైల‌జా, అనూషా, ప‌ల్ల‌వి, సిద్ధు, కామ్నాసింగ్, చంద్ర సిద్ధార్థ ఆర్క‌, రాజారాం (ర‌ఘు) త‌దిత‌రులు న‌టిస్తోన్న ఈ చిత్రానికి  డిఓపీః మ‌ల్లిక్ కె చంద్ర‌;  సంగీతంః జాన్‌; స్టంట్ః రామ్ సుంక‌ర‌; ఎడిట‌ర్ః నాగిరెడ్డి;  పాట‌లుః సురేష్ గంగుల‌;  ప్రొడ‌క్ష‌న్ ఎగ్జిక్యూటివ్ః రాజ వంశి;  పీఆర్వోః ర‌మేష్ చందు ( బాక్సాఫీస్‌) స్టోరిః వింధ్య రెడ్డి;  నిర్మాతః రావుల ర‌మేష్‌;  స్క్రీన్ ప్లే- మాట‌లు-నృత్యాలు-ద‌ర్శ‌క‌త్వంః పాలిక్‌

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Deputy CM ట్రెండ్, 10 వేల మంది జీవితాలు పోతాయ్ అంటారా? సీజ్ ది షిప్ అంటూ పవన్ కల్యాణ్

రోడ్డుపై వెళ్తున్న వ్యక్తిపై గాడిద దాడి.. కాలికి తీవ్రగాయం వీడియో వైరల్

నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం... ఆ రెండు పోర్టులకు ప్రమాద హెచ్చరికలు

పోర్టులోకి రైస్ ఎలా వస్తుంది? డిప్యూటీ సీఎం అయిన నాకే సహకారం లేదు: పవన్ విస్మయం (video)

వైనాట్ 175 అన్నారు.. చివరకు 11 వచ్చాయి.. అయినా మార్పు రాలేదు : జగన్‌పై బాలినేని ఫైర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments