Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మాచర్ల నియోజకవర్గం టీజర్ 9 మిలియన్ రికార్డ్

మాచర్ల నియోజకవర్గం  టీజర్  9 మిలియన్ రికార్డ్
, గురువారం, 31 మార్చి 2022 (13:00 IST)
Nitin record
హీరో నితిన్ తన రాబోయే మాస్, యాక్షన్ ఎంటర్‌టైనర్ `మాచర్ల నియోజకవర్గం`లో సిద్ధార్థ్ రెడ్డి అనే IAS ఆఫీసర్‌గా కనిపించనున్నాడు. నితిన్ సినిమా ఫస్ట్ ఎటాక్‌తో కలెక్టర్ సాబ్‌గా  స్ట‌యిలిష్‌గా అడుగుపెట్టాడు, అది సినీ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది. ఇదే విష‌యాన్ని ఇప్పటివరకు సాధించిన రికార్డు వీక్షణలు రుజువు చేస్తున్నాయి.
 
ఈ టీజర్‌కు 24 గంటల్లో 9 మిలియన్ వ్యూస్ రావడం నితిన్ కెరీర్‌లో రికార్డు. అంతేకాదు, ప్రోమో 100K+ లైక్‌లను సంపాదించింది. నిజానికి, టీజర్ లో నితిన్‌ని పవర్‌ఫుల్ గెటప్‌లో చూపించ‌డంతోపాటు హై ఇంటెన్స్ యాక్షన్ సీక్వెన్స్‌తో మాస్ త‌ర‌హాలో ఆకర్షణీయంగా కనిపించింది.
 
ఎంఎస్ రాజశేఖర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సుధాకర్ రెడ్డి, నికితారెడ్డి నిర్మిస్తున్నారు. మహతి స్వర సాగర్ ఈ చిత్రానికి స్వరాలు అందించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఉగాదికి గ్రాండ్‌గా రవితేజ న‌టిస్తున్న టైగర్ నాగేశ్వరరావు ప్రీ లుక్ రాబోతోంది