Webdunia - Bharat's app for daily news and videos

Install App

క్యాన్సర్‌తో పోరాడి తావసి కన్నుమూత.. సాయం చేసినా దీనస్థితిలో..?

Webdunia
మంగళవారం, 24 నవంబరు 2020 (10:42 IST)
Thavasi
తమిళంలో హాస్యనటుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఓ వెలుగు వెలిగిన తావసి కన్నుమూశారు. క్యాన్సర్‌తో పోరాడుతూ వైద్యానికి డబ్బుల్లేక ఆర్థిక సాయం కోరుతూ ఇటీవల వార్తల్లో నిలిచిన మదురైలోని హాస్పిటల్‌లో తుది శ్వాస విడిచారు.

తావసి బక్కచిక్కిపోయిన ఆకారం చూసి తమిళ ప్రేక్షకులతో పాటు సినీలోకం కదిలివచ్చి ఆయనకు సాయం చేసేందుకు సిద్ధం కాగా, ప్రపంచానికి ఆయన విషయం తెలిసిన కొన్ని రోజులకే ప్రాణాలు కోల్పోయారు.

తమిళంలో 140 సినిమాల్లో పైగా సినిమాల్లో నటించిన తావసి దీన స్థితిలో మరణించారు. రజనీకాంత్ 'అన్నాత్తే' సినిమాలో కూడా తావసి నటించారు.
 
నిజానికి తావసి పరిస్థితి గురించి తెలియడంతో కోలీవుడ్ నటులు విజయ్ సేతుపతి, సూరి, శివకార్తికేయన్, సౌందరరాజా, శింబు ఆర్థిక సాయం అందించేందుకు ముందుకు వచ్చారు. అలాగే, సూపర్ స్టార్ రజినీకాంత్ కూడా తావసి వైద్యానికి ఆర్థిక సాయం అందజేయడానికి పూనుకున్నారు. 
 
నిజానికి తావసి ఆరోగ్యం బాగోకపోవడంతో డైరెక్టర్ శరవణ శక్తి ఆయన్ని చికిత్స నిమిత్తం డీఎంకే ఎమ్మెల్యే డాక్టర్ శరవణన్ దగ్గరకి తీసుకెళ్లారు. తావసికి క్యాన్సర్ అని తేలడంతో అప్పటి నుంచి శరవణన్ హాస్పిటల్‌లో వైద్యం అందిస్తున్నారు. 
 
తావసి పరిస్థితి గురించి డాక్టర్ శరవణన్ సైతం సోషల్ మీడియాలో ఒక వీడియోను పోస్ట్ చేశారు. తావసి వైద్యానికి తాను కొంత ఆర్థిక సాయం చేశానని.. కోలీవుడ్ హీరోలు ముందుకు రావాలని శరవణన్ కోరారు. కానీ, ఇంతలోనే తావసి కన్నుమూశారు.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments