Webdunia - Bharat's app for daily news and videos

Install App

న‌న్ను మెగాస్టార్ అని అంద‌రూ పిల‌వ‌డానికి కార‌ణం ఆయ‌నే - చిరంజీవి

సుప్రీమ్‌ హీరో సాయిధరమ్‌ తేజ్‌ కథానాయకుడిగా, అనుపమ పరమేశ్వరన్‌ హీరోయిన్‌గా క్రియేటివ్‌ కమర్షియల్స్‌ మూవీ మేకర్స్‌ పతాకంపై ఎ.కరుణాకరన్‌ దర్శకత్వంలో క్రియేటివ్‌ ప్రొడ్యూసర్‌ కె.ఎస్‌.రామారావు నిర్మిస్తున్న చిత్రం 'తేజ్‌'. ఐ లవ్‌ యు అనేది ఉపశీర్షిక. గోపీ

Webdunia
సోమవారం, 11 జూన్ 2018 (12:19 IST)
సుప్రీమ్‌ హీరో సాయిధరమ్‌ తేజ్‌ కథానాయకుడిగా, అనుపమ పరమేశ్వరన్‌ హీరోయిన్‌గా క్రియేటివ్‌ కమర్షియల్స్‌ మూవీ మేకర్స్‌ పతాకంపై ఎ.కరుణాకరన్‌ దర్శకత్వంలో క్రియేటివ్‌ ప్రొడ్యూసర్‌ కె.ఎస్‌.రామారావు నిర్మిస్తున్న చిత్రం 'తేజ్‌'. ఐ లవ్‌ యు అనేది ఉపశీర్షిక. గోపీ సుంద‌ర్ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో ఆవిష్క‌ర‌ణ కార్య‌క్ర‌మం హైద‌రాబాద్‌లో జ‌రిగింది. మెగాస్టార్ చిరంజీవిముఖ్య అతిథిగా హాజ‌రై ఆడియో సీడీల‌ను ఆవిష్క‌రించారు. 
 
ఈ సంద‌ర్భంగా మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ - ``తేజుపై ప్రేమ కంటే కె.ఎస్‌.రామారావుగారిపై అభిమానం, ప్రేమ‌తో ఈ ఫంక్ష‌న్‌కి వ‌చ్చాను. ఆయ‌న నా ప్రియ‌మైన మిత్రుడు, న‌చ్చిన నిర్మాత‌. ఇది నిజం. త‌ర్వాతే తేజు, క‌రుణాక‌ర‌ణ్ అంద‌రూ లిస్టులో వ‌స్తారు. 
 
80వ ద‌శ‌కంలో చిరంజీవికి ఎక్కువ శాతం సూప‌ర్‌డూప‌ర్ హిట్ చిత్రాలు ఉన్నాయ‌న్నా, చిరంజీవి న‌వ‌లా క‌థ‌నాయ‌కుడు అనే పేరు తెచ్చుకున్నా, చిరంజీవికి ఎవ‌రికీ లేన‌న్ని సూప‌ర్‌హిట్ సాంగ్స్‌, ముఖ్యంగా ఇళ‌య‌రాజాగారి నుండి వ‌చ్చాయ‌న్నా, అప్ప‌టి దాకా సుప్రీమ్ హీరో అని అభిమానులు అభిమానంతో బిరుదులు ఇచ్చినా, మెగాస్టార్ అని ఈరోజు ఆప్యాయంగా, ముద్దుగా పిలుస్తున్న పేరు ఎవ‌రిచ్చారు అని చూసుకుంటే.. అన్నింటికి దొరికే స‌మాధాన‌మే క్రియేటివ్ క‌మ‌ర్షియ‌ల్స్ అధినేత కె.ఎస్.రామారావు గారే. 
 
ఆ బ్యాన‌ర్‌తో నాకు ఎంతో అవినాభావ సంబంధం ఉంది. 1982లో అభిలాష‌, చాలెంజ్‌, రాక్ష‌సుడు, మ‌ర‌ణ‌మృదంగం వంటి వ‌రుస హిట్స్ వ‌చ్చాయంటే. అలాంటి క‌థాంశాల‌ను సినిమాలుగా ఎన్నుకోవాలి. అలాంటి సినిమాలను ప్రేక్ష‌కుల ముందుకు హృద్యంగా తీసుకు వ‌చ్చామంటే అందులో ముందుగా చెప్పుకోవాల్సిన పేరు కె.ఎస్‌.రామారావుగారి గురించే. 
 
అభిలాష సినిమా స‌మ‌యంలో ఆయ‌న‌తో ప‌రిచ‌యం అయ్యింది. అప్ప‌టివ‌ర‌కు ఆయ‌న‌తో సినిమా చేయాల‌ని ఉన్నా, ఎలాంటి సినిమా చేయాల‌నే దానిపై క్లారిటీ లేని స‌మ‌యంలో మా అమ్మ‌గారు అభిలాష అనే న‌వ‌ల చ‌దివారు. అందులో హీరో పేరు కూడా చిరంజీవి. అది చ‌దువుతున్నంత సేపు నువ్వే గుర్తుకొచ్చావు, నిన్నే ఊహించుకుని క‌థ చ‌దివాను. దాన్ని సినిమాగా తీస్తే బావుంటుంద‌ని అమ్మ‌గారు చెప్పారు. దాంతో నేను చెన్నై వెళ్లిన‌ప్పుడు రామారావుగారు నన్నుక‌లిసి, యండ‌మూరి వీరేంద్ర‌నాథ్‌గారు రాసిన అభిలాష న‌వ‌ల గురించి చెప్పి, సినిమా చేస్తామా బాస్‌! అన్నారు. 
 
అప్ప‌టికే అమ్మ‌గారు ఆ సినిమా గురించి చెప్పి ఉండ‌టంతో నేను కూడా పెద్ద‌గా స‌మ‌యం తీసుకోలేదు. ఎస్‌.. చెప్పాను. ఆ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో నేను చెప్ప‌న‌క్క‌ర్లేదు. 80 ద‌శ‌కంలో నాకు అన్ని హిట్స్ వ‌చ్చి ఎక్కువమంది ప్రేక్ష‌కుల ఆద‌ర‌ణ పొందానంటే అందుకు ప్ర‌త్య‌క్ష ఉదాహ‌ర‌ణ కె.ఎస్‌.రామారావుగారే. అందులో ఎలాంటి సందేహం లేద‌న్నారు చిరంజీవి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

యూజీ నీట్ ప్రవేశ పరీక్షా విధానంలో కీలక మార్పు?

మహా పీఠముడి... మహారాష్ట్ర కొత్త ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు?

డోనాల్డ్ ట్రంప్‌కు భారీ ఊరట.. ఏంటది..?

అరెస్టుకు సిద్ధంగా పోలీసులు.. పారిపోయిన రాంగోపాల్ వర్మ!!

బంగాళాఖాతంలో అల్పపీడనం : ఏపీతో సహా ఆ రాష్ట్రాలకు భారీ వర్ష సూచన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

తర్వాతి కథనం
Show comments