Webdunia - Bharat's app for daily news and videos

Install App

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అని పెట్టడానికి కారణం అదే : ధమాకా నిర్మాత టిజి విశ్వ ప్రసాద్

Webdunia
శనివారం, 24 డిశెంబరు 2022 (17:50 IST)
TG. viswaprasad
రవితేజ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ ''ధమాకా'. త్రినాథరావు నక్కిన దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రవితేజ సరసన  శ్రీలీల హీరోయిన్ గా నటించింది. నిర్మాత టిజి విశ్వ ప్రసాద్  గ్రాండ్ గా నిర్మించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ & అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పతాకాలపై రూపొందిన ఈ చిత్రానికి వివేక్ కూచిభొట్ల సహ నిర్మాత. డిసెంబర్ 23న ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'ధమాకా' అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ధమాకా బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న నేపధ్యంలో నిర్మాత టిజి విశ్వ ప్రసాద్ చిత్ర విజయాన్ని విలేఖరుల సమావేశంలో పంచుకున్నారు.  
 
 పీపుల్స్ మీడియాలో ఇదే పెద్ద బడ్జెట్ ప్రాజెక్ట్ నా ?  
ఇంతకుముందు వెంకీ మామ సినిమాని కూడా సిమిలర్ బడ్జెట్ లోనే చేశాం.
 
ధమాకా పాటల కోసం భారీ సెట్స్ వేశారు కదా ?
అవునండీ. ధమాకా లో సాంగ్స్ ప్రధానమైనవి. పాటలన్నీ అద్భుతంగా వచ్చాయి. రవితేజ గారు శ్రీలీల డ్యాన్సులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. థియేటర్స్ ప్రేక్షకులు రెస్పాన్స్ అద్భుతంగా వుంది. ఎక్స్ టార్డినరీగా ఎంజాయ్ చేస్తున్నారు. బీ సీ సెంటర్ల రెస్పాన్స్ మేము ఊహించాం. మల్టీప్లెక్స్ ఆడియన్స్ నుండి మేము ఊహించిన దానికంటే ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది.
 
రవితేజ గారు మీ నిర్మాణంలో మళ్ళీ మళ్ళీ చేస్తానని చెప్పారు కదా ?
అవునండీ. కొన్ని ప్రాజెక్ట్స్ ప్లాన్ చేస్తున్నాం.
 
కథల విషయంలో మీ ఆలోచనలు ఎలా వుంటాయి ?
ధమాకా కంప్లీట్ మాస్ ఎంటర్ టైనర్ కథ. రవితేజ గారి ఎనర్జీ ని పూర్తిగా ఎక్స్ ప్లోర్ చేస్తూ చేసిన మూవీ. అలాగే ఎవరూ ఊహించని ట్విస్ట్ కూడా వుంది. సినిమాలోని ప్రతి ఎలిమెంట్ ని  ప్రేక్షకులు చాలా ఎంజాయ్ చేస్తున్నారు. థియేటర్స్ నుండి ఎక్స్ ట్రార్డినరీ రెస్పాన్స్ వస్తోంది.
 
పీపుల్ మీడియా ఫ్యాక్టరీలో చాలా ప్రాజెక్ట్స్ చేస్తున్నారు కదా.. భవిష్యత్ ప్లానింగ్స్ ఎలా వున్నాయి ?
ఒక ఫ్యాక్టరీ మోడల్ లో పని చేయాలనే ఉద్దేశంతోనే పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ని మొదలుపెట్టాం. కంటిన్యూస్ సినిమాలు నిర్మిస్తాం. డిఫరెంట్ కంటెంట్ తో మంచి లైనప్ వుంది.  
 
ఓటీటీ పై కూడా ద్రుష్టి పెట్టినట్లు వున్నారు ?
ఓటీటీకి చాలా కంటెంట్ డెలివర్ చేస్తున్నాం. ఇప్పటికే మూడు ప్రాజెక్ట్స్ ని ఓటీటీ వేదికగా విడుదల చేశాం. ప్రొడక్షన్ లో మరికొన్ని ప్రాజెక్ట్స్ వున్నాయి.
 
విడుదలకు సిద్ధమౌతున్న చిత్రాలు ?
నాగశౌర్య- శ్రీనివాస్ అవసరాల ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి.. గోపీచంద్ - శ్రీవాస్ కాంబినేషన్ లో రామబాణం .. అలాగే లావణ్య త్రిపాఠితో ఒక ప్రాజెక్ట్ వుంది. తర్వాత కొన్ని పెద్ద చిత్రాలు వున్నాయి. తర్వలోనే ప్రకటిస్తాం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీలో పలుచోట్ల 42 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు

నా భార్యను ఆమె ప్రియుడికిచ్చి ఎందుకు పెళ్లి చేశానంటే... వివరించిన భర్త (Video)

నా కూతురినే ప్రేమిస్తావా? చావు: గొడ్డలితో నరికి చంపిన వ్యక్తి

అందాల పోటీలు నిలిపివేసి.. అమ్మాయిలకు స్కూటీలు ఇవ్వాలన్న కేటీఆర్!!

పెరుగన్నంలో విషం కలిపి కన్నబిడ్డలకు పెట్టింది.. ఆపై తానూ ఆరగించింది (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments