ఎం.బి.బి.ఎస్. చదివే డాక్టరమ్మ నటిగా తొలిసినిమా పెళ్లి సందడితో హీరోయిన్‌గా తెలుగులో గుర్తింపు సంపాదించింది. ఆ సినిమా తర్వాత ధమాకా సినిమాలో రవితేజ సరసన నటించింది. ఇక ఆ తర్వాత మహేష్‌బాబు, బాలకృష్ణ పక్కన కూడా నటిస్తోంది. ఇదంతా డెస్టినీ అని తన ప్రమేయం ఏమీ లేదని చెబుతోంది. అయితే ధమాకాలో మర్చిపోలేని సంఘటన గురించి ఇలా చెప్పుకొచ్చింది.
రవితేజతో స్పెయిన్‌లో జింతాక జింతాక సాంగ్ షూట్ చేయాలి. రేపు షూట్ జరగబోతుంది అనగా నా సూట్ కేసు మాయమయింది. ఎంత వెతికినా కనిపించలేదు. సూటకేసులో నా కాస్టూమ్స్ అన్నీ వున్నాయి. నాకు విపరీతమైన టెన్షన్ పట్టుకుంది. సూట్‌కేసు పోయింది అనిచెబితే నమ్ముతారోలేదోనని భయం కూడా కలిగింది. ఈ విషయాన్ని ముందుగా దర్శకుడితో చెప్పాను. ఆయన చేసేదిలేక కాస్టూమర్‌తో కలిసి షూటింగ్ లొకేషన్ నుంచి దాదాపు 4గంటలు జర్నీచేసి లేడీస్ షాప్‌కు వెళ్ళారు. అక్కడ వీరిని చిత్రంగా చూశారట. ఎందుకంటే అన్నీ లేడీస్ ఐటం కొనాలిగదా అందుకే. వారు అక్కడినుంచే ఫొటోలు పంపి ఈ డ్రెస్ ఓకేనా, ఈ చెవి రింగులు ఓకేనా అంటూ అడిగి మరీ తీసుకువచ్చారు. ఒకరకంగా ఫ్యామిలీ మెంబర్‌గా నన్ను ట్రీట్ చేశారని చెప్పుకొచ్చింది.