Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫిబ్రవరి 7న "తండేల్" రిలీజ్.. సంక్రాంతితో పోటీ వద్దు.. వాలెంటైన్స్ డేనే ముద్దు

డీవీ
మంగళవారం, 5 నవంబరు 2024 (17:24 IST)
Tandel
నాగ చైతన్య హీరోగా సాయి పల్లవి హీరోయిన్‌గా దర్శకుడు చందూ మొండేటి తెరకెక్కిస్తున్న భారీ సినిమా "తండేల్". ఈ సినిమా విడుదల తేదీని నిర్మాత అల్లు అరవింద్ ప్రకటించారు. నాగ చైతన్య, సాయి పల్లవి నటించిన "తండేల్"  ఫిబ్రవరి 7న రిలీజ్ చేస్తున్నట్లు వీడియో ద్వారా అల్లు అరవింద్ హైదరాబాదులో ప్రకటించారు.
 
ఈ సందర్భంగా అల్లు అరవింద్ మాట్లాడుతూ, క్రిస్మస్ అనుకున్నాం.. సంక్రాంతికి కాదు.. ఫిబ్రవరి 7న రిలీజ్ చేస్తున్నామని తెలిపారు. ఇక ఈ సినిమాకి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. అలాగే గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై అల్లు అరవింద్ సమర్పణలో సినిమా తెరకెక్కుతుంది.
 
టాలీవుడ్ సినిమాలు అంటేనే సంక్రాంతికి పోటీ ఎక్కువ ఉంటాయి. బాల‌య్య‌, వెంకీ, రామ్ చ‌ర‌ణ్ సినిమాలు సంక్రాంతి బ‌రిలో నిలిచాయి. ఈ ద‌శ‌లో తండేల్ని దింప‌డం అంత బెట‌ర్ ఆప్ష‌న్ కాద‌న్న‌ది గీతా ఆర్ట్స్ అభిప్రాయం.
 
పైగా.. వెంక‌టేష్ సినిమా బ‌రిలో ఉంది. అలాంట‌ప్పుడు చైతూ రిస్క్ తీసుకోలేరు. పైగా మెగా కుటుంబం నుంచి "గేమ్ ఛేంజ‌ర్" వ‌స్తోంది. అందుకే తండేల్‌ను కాస్త వెనక్కి నెట్టారని సినీ పండితులు అంటున్నారు. అయితే వాలెంటైన్స్ డేకు ముందుగా ఈ సినిమా రిలీజ్ చేస్తే సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందని వారు చెప్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రాంచీలో కనిపించిన తక్షక పాము.. (వీడియో)

ఏక్‌నాథ్ షిండే కలత చెందారు... అయినా నో ఛాన్స్ : కేంద్రమంత్రి రాందాస్

భూమివైపుకు దూసుకొస్తున్న గ్రహశకలం.. ఏమైంది?

ఇస్కాన్ గురువు తరపున వాదించేందుకు ముందుకు రాని బంగ్లా లాయర్లు!!

శ్రీవారి భక్తులకు త్వరలో శుభవార్త చెప్పనున్న తితిదే...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖర్జూరాలు పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాలు

మట్టి పాత్రలులో చేసిన వంటకాలు తింటే ఫలితాలు

బీపిని సహజసిద్ధంగా తగ్గించుకునే మార్గాలు

రేడియోథెరపీ, ఇంటర్‌స్టీషియల్ బ్రాకీథెరపీని ఉపయోగించి తీవ్రస్థాయి గర్భాశయ సంబంధిత క్యాన్సర్‌ కి చికిత్స

Asthma in Winter Season, ఈ సమస్యను తెచ్చే ఆహార పదార్ధాలు, పరిస్థితులు

తర్వాతి కథనం
Show comments