Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

డిసెంబర్‌లో నాగచైతన్య - శోభితల వివాహం.. ఎక్కడ జరుగుతుందంటే?

nagachaitanya

సెల్వి

, గురువారం, 31 అక్టోబరు 2024 (09:41 IST)
నాగచైతన్య - శోభితల వివాహం డిసెంబర్ నెలలో ఉంటుందంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. తాజాగా ఈ విషయాన్ని అక్కినేని కుటుంబ సభ్యులు ధ్రువీకరించారు. 
 
వారం రోజుల క్రితం శోభిత తన ఇన్‌స్టా వేదికగా 'పసుపు దంచటం .. ఇక ఆరంభమైంది' అంటూ పెళ్లి పనులు మొదలు పెట్టినట్లు పరోక్షంగా ప్రకటించి అందుకు సంబంధించిన ఫోటోలను షేర్ చేశారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో అధికారికంగా చెప్పకపోయినా త్వరలోనే పెళ్లి ఉంటుందని టాక్ మొదలైంది. 
 
నాగచైతన్య - శోభితల నిశ్చితార్ధ వేడుక ఈ ఏడాది ఆగస్టు 8న కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. ఇక డిసెంబర్ నాలుగో తేదీన వీరి వివాహం వుంటుందని టాక్. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ద్వారకాధీశుడు శ్రీకృష్ణుడిగా ప్రిన్స్ మహేష్ బాబు