Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిర్మాతల కష్టాలను హీరోలు పట్టించుకోవడం లేదు : దిల్ రాజు

ఠాగూర్
బుధవారం, 5 మార్చి 2025 (14:55 IST)
సినీ హీరోలపై ప్రముఖ నిర్మాత దిల్ రాజు సంచలన ఆరోపణలు చేశారు. నిర్మాతల కష్టాలను హీరోలు పట్టించుకోవడం లేదన్నారు. పైరసీ వల్ల నిర్మాతలు తీవ్రంగా నష్టపోతున్నారని, హీరోలు మాత్రం నిర్మాతల నష్టపోతే మాకేంటి అనే ధోరణితో వ్యవహరిస్తున్నారన్నారు. 
 
ఆయన బుధవారం విలేకరులతో మాట్లాడుతూ, సినిమా పైరసీకి గురైతే నిర్మాత తీవ్రంగా నష్టపోతుండగా హీరోలు, ఇతర ఆర్టిస్టులు మాత్రం తమకేమిటి అన్నట్టుగా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. సినిమా ఇండస్ట్రీని పైరసీ సమస్య తీవ్రంగా వేధిస్తుందన్నారు. సినిమా పైరసీకి గురైతే నిర్మాత మాత్రమే నష్టపోతున్నారని, హీరోలు సురక్షితంగా ఉంటున్నారన్నారు. 
 
నిర్మాత కష్టాన్ని పట్టించుకోకుండా తదుపరి ప్రాజెక్టులో బిజీగా మారిపోతున్నారని చెప్పారు. నిర్మాత నష్టపోతే మాకేంటి అనే ధోరణి సరికాదన్నారు. తమ వరకు వస్తే కానీ ఆ నొప్పి తెలియదని అన్నారు. త్వరలోనే ఈ విషయంపైనా మీటింగ్ పెట్టుకుంటామని ఆయన చెప్పారు. అలాగే, పైరసీపై తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడంపై దృష్టిసారించినట్టు దిల్ రాజు వెల్లడించారు. ఇదే విషయంపై ప్రభుత్వానికి లేఖ రాయనున్నట్టు ఆయన తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Bengaluru: స్నేహితుడి భార్యతో అక్రమ సంబంధం.. చివరికి భార్య, స్నేహితుడి చేతిలోనే?

యూఎస్ వీసా దొరకలేదు.. మనస్తాపంతో జగిత్యాలలో 25 ఏళ్ల మహిళ ఆత్మహత్య

బుడమేరు వరద వార్తలను నమ్మొద్దు, వెలగలేరు గేట్లు తెరవలేదు: ఎన్టీఆర్ కలెక్టర్ (video)

సెప్టెంబర్ చివరి వారంలో అమెరికాలో సందర్శించనున్న ప్రధాని మోదీ

Kerala man: భార్య ఉద్యోగం కోసం ఇంటిని వదిలి వెళ్లిపోయింది.. భర్త ఆత్మహత్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

కూల్‌డ్రింక్స్ తాగితే పక్షవాతం తప్పదంటున్న వైద్య నిపుణులు

స్నాక్స్ గుగ్గిళ్లు తింటే బలం, ఇంకా ఏం ప్రయోజనాలు?

తర్వాతి కథనం
Show comments