హీరోయిన్ల వయసుపై సీనియర్ నటి జ్యోతిక కీలక వ్యాఖ్యలు చేశారు. దక్షిణాదిలో చాలా మంది దర్శకులు హీరోల కోసమే కథలు రాసుకుంటారని ఆమె అన్నారు. వయసు పెరిగినా, వారిని జనాలు హీరోలుగా ఒప్పకుంటారని, హీరోయిన్ల వయసు పెరిగితే అస్సలు ఒప్పకోరని చెప్పారు. తాను నటించిన వెబ్ సిరీస్ "దబ్బా కార్టెల్" శుక్రవారం నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది. ఈ సిరీస్ ప్రమోషన్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.
తనకు 28 యేళ్ల యవసులో పిల్లలు పుట్టారని, ఆ తర్వాత విభిన్న పాత్రలు చేసుకుంటూ వస్తున్నానని జ్యోతిక తెలిపారు. అప్పటి నుంచి స్టార్ హీరోలతో కలిసి నటించలేదని చెప్పారు. సౌత్‌లోని ఇతర ఇండస్ట్రీల గురించి తాను చెప్పలేను కాన, కోలీవుడ్ చిత్రపరిశ్రమలో మాత్రం హీరోయిన్‌కు వయసును అడ్డుగా చూస్తారని అన్నారు. అలాంటపుడు మనమే కొత్త దర్శకులతో పని చేస్తూ కేరీర్‌ను నిర్మించుకోవాలని చెప్పారు.