మంచి హ్యుమర్ వున్న హార్ట్ వార్మింగ్ మూవీ సత్యం సుందరం. ప్రతి ఒక్కరూ చూడదగ్గ సినిమా. ఫ్యామిలీతో కలసి చూడండి. చాలా ఎంజాయ్ చేస్తారు. మా అన్నయ్య సూర్య నా మొదటి చూసి నన్ను హాగ్ చేసుకున్నారు. మళ్ళీ ఇప్పుడు 'సత్యం సుందరం' చూసి చాలా ప్రౌడ్ గా హాగ్ చేసుకున్నారు. నీకే ఇలాంటి కథలు భలే వస్తున్నాయే అంటూ కామెంట్ చేశారని హీరో కార్తి అన్నారు.
హీరో కార్తీ, అరవింద్ స్వామి లీడ్ రోల్స్ లో రాబోతున్న హోల్సమ్ ఎంటర్‌టైనర్ 'సత్యం సుందరం'. 96 ఫేమ్ సి ప్రేమ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. 2డి ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై సూర్య, జ్యోతిక నిర్మించారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. సెప్టెంబర్ 28న ఈ సినిమా గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ నేపధ్యంలో హీరో కార్తి విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలని పంచుకున్నారు.
- నేను, అరవింద్ స్వామి.. మా ఇద్దరిలో ఎవరు లేకపోయినా ఈ సినిమా లేదు
-96 సినిమా తర్వాత డైరెక్టర్ ప్రేమ్ కుమార్ చేస్తున్న సినిమా ఇది. 96 కి చాలా ఫాలోయింగ్ వవుంది. దాదాపు ఆరేళ్ళ తర్వాత ఆయన నుంచి వస్తున్న సినిమా. రెండేళ్ళ క్రితం నా కోసం ప్రేమ్ దగ్గర ఓ కథ వుందని నా ఫ్రెండ్ చెప్పాడు. కానీ ఆయన నాకు చెప్పడానికి భయపడుతున్నారు. నేనే మెసేజ్ చేశాను. అప్పుడాయన ఈ స్క్రిప్ట్ ని చదవమని ఇచ్చారు. స్క్రిప్ట్ ని ఒక అద్భుతమైన నవల రాశారు. మొత్తం చదివాను. చాలా చోట్ల ఆనందంలో కన్నీళ్ళు వచ్చాయి. ఇలాంటి కథ ఎలా రాస్తారని అనిపించింది. నాకు కే విశ్వనాధ్ గారి సినిమాలు ఇష్టం. కానీ ఇప్పుడు అలాంటి కథలు రావడం లేదు. ఈ కథ చదివినప్పుడు అలాంటి ఒక మంచి సినిమా అవుతుందనిపించింది. చాలా రేర్ స్క్రిప్ట్. డిఫినెట్ గా చేయాలనిపించింది. మనలోని చాలా ప్రశ్నలు సమాధానం ఇచ్చే కథ ఇది. అన్నయ్యకి కథ చదవమని చెప్పాను. అన్నయ్యకి చాలా నచ్చింది. నీకు మాత్రమే ఇలాంటి కథలు ఎలా వస్తున్నాయి అన్నారు. ఖచ్చితంగా చేద్దామని చెప్పారు.
-బ్రదర్స్ లాంటి రెండు క్యారెక్టర్స్ మధ్యనడిచే కథ ఇది. ప్రతి ఒక్కరూ చూడాలనుకునే సినిమా. అరవింద్ స్వామి గారు ఇందులో క్యారెక్ట కి ర్ పర్ఫెక్ట్. ఆయన చదివి చాలా ఎమోషనల్ అయ్యారు. ఈ కథని చదివినవారంతా ప్రాజెక్ట్ లో పార్ట్ అవ్వాలని ఆసక్తి చూపారు. 96లానే ఇది ఒక్క నైట్ లో జరిగే కథ. ఫ్యామిలీ ఆడియన్స్ కి కొత్త ఎక్స్ పీరియన్స్ ఇస్తుంది. సాగర సంగమం సినిమా చూసినప్పుడు ఎలాంటి ఒక అద్భుతమైన అనుభూతి కలుగుతుందో సత్యం సుందరంలో కూడా లాంటి ఓ మంచి అనుభూతిని ప్రేక్షకులు ఆస్వాదిస్తారు. విశ్వనాథ్ గారి సినిమాలు కమర్షియల్ బ్లాక్ బస్టర్సే. ఇది కూడా అలాంటి సినిమానే.
-చాలా మంచి హ్యుమర్ ఫీలింగ్ వున్న ఎమోషనల్ కంటెంట్. చాలా చోట్ల హ్యాపీ టియర్స్ వస్తాయి. ఊపిరి సినిమా చూసినప్పుడు చాలా బ్యూటీఫుల్ ఎమోషన్ వుంటుంది కదా.. అలాంటి హ్యాపీ ఎమోషన్ వున్న కథ.
-ఇలాంటి కథ అరవింద్ స్వామీగారి నిజ జీవితంలో జరిగిందని తెలిసి చాలా సర్ ప్రైజ్ అయ్యాను. ఆయన గ్రామంలోనే పుట్టి పెరిగారు. ఈ సినిమాలో అరవింద్ గారి క్యారెక్టర్ లో ఆయన్ని తప్పితే మరొకని ఊహించలేం. మా క్యారెక్టర్ మధ్య చాలా మంచి కెమిస్ట్రీ వుంటుంది.
- తెలుగు దేవర వుంది. అది చాలా పెద్ద సినిమా. మా సినిమా రోజు తర్వాత రావడం బెటర్. రెండు చాలా డిఫరెంట్ ఫిలిమ్స్. అది ఒక వార్ లా వుంటుంది. మాది సీతమ్మ వాకిట్లో లాంటి సినిమా.
-ఇందులో డైలాగులు కూడా కొత్తగా నేచురల్ గా వుంటాయి. కెమరామూమెంట్స్ కూడా చాలా ఆర్గానిక్ గా వుంటాయి. ఒక లైఫ్ లా కనిపిస్తుంది. రియల్ ఎమోషన్స్ ని ఆడియన్స్ తెరపై ఎంజాయ్ చేస్తారు. ఫ్యామిలీతో వచ్చి ఈ సినిమా చూస్తే ఇంకా ఆస్వాదిస్తారు.
- సినిమా ప్రోడ్యుస్ చేయడం వరకే కానీ అన్నయ్య ఇన్వాల్ అవ్వరు. ఒక రోజు మాత్రం రాత్రి షూటింగ్ కి రోలెక్స్ వచ్చారు. అందరికీ తెలిసిపోయి జనం వచ్చేశారు. కాసేపు షూటింగ్ కి బ్రేక్ ఇచ్చి మళ్ళీ చేశాం
- డిల్లి, రోలెక్స్ పేస్ అఫ్ చిత్రాలు నెక్స్ట్ ఇయర్ వుంటుంది. ఊపిరి తర్వాత తెలుగులో చేయలేదు. కథలు వింటున్నాను. తప్పకుండా చేస్తాను.
- ప్రస్తుతం సర్దార్ 2 జరుగుతోంది. వా వాతియారే అనే సినిమా వుంది. ఖైదీ 2 నెక్స్ట్ ఇయర్ ఉండొచ్చు.