Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

చక్కటి జానపద సాహిత్యం, రసానుభూతి కలిగించేలా ప్రణయ గోదావరి గీతం : చంద్రబోస్‌

Pranaya Godavari team with chandrabose

డీవీ

, సోమవారం, 23 సెప్టెంబరు 2024 (18:38 IST)
Pranaya Godavari team with chandrabose
సదన్ హీరోగా, ప్రియాంక ప్రసాద్ హీరోయిన్‌గా నటిస్తున్న చిత్రం 'ప్రణయగోదారి'.  పి.ఎల్.విఘ్నేష్ దర్శకత్వంలో పారమళ్ళ లింగయ్య నిర్మిస్తున్నారు. డిఫెరెంట్ కంటెంట్‌తో ఫీల్ గుడ్ ఎంటర్ టైనర్‌గా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు మేకర్స్‌.  ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ చేసిన కంటెంట్ అందరినీ ఆకట్టుకుంది.

ఇటీవల గణేష్‌ మాస్టర్‌ చేతుల మీదుగా విడుదల చేసిన గు...గుగ్గు అనే  పాటకు కూడా మంచి స్పందన వస్తోంది. తాజాగా ఈ చిత్రం నుంచి మరో బ్యూటీఫుల్‌ మెలోడి సాంగ్‌ చూడకయ్యో.. నెమలికళ్ళ అనే పాటను ఆస్కార్‌ అవార్డ్‌ విన్నర్‌ ప్రముఖ లిరిసిస్ట్‌ చంద్రబోస్‌ విడుదల చేశారు. 
 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 'ఇప్పుడే పాట విన్నాను.. చూడకయ్యో.. నెమలికళ్ళ తూగుతున్న తూనీగల్లా అనే పల్లవితో కొనసాగే ఈ పాటలో మంచి సాహిత్యం, సంగీతం వుంది. మార్కండేయ ఈ పాటకు చక్కని సాహిత్యంతో పాటు ఆకట్టుకునే స్వరకల్పన చేశాడు. చక్కటి జానపద సాహిత్యం ఇది. అందరికి చేరువయ్యే తేలికైన మాటలతో.. వినగానే రసానుభూతి కలిగించేలా మంచి సాహిత్యం అందించారు. పాట బాణీతో పాటు నడక, దాని వెనకాల వచ్చే బీట్‌ కూడా నాకు బాగా నచ్చింది.  గాయనీ సునీత, సాయిచరణ్‌ తన గాత్రంతో పాటకు జీవం పోశారు. నాకు ఈ మధ్య కాలంలో అమితంగా నచ్చిన పేరు 'ప్రణయగోదారి' టైటిల్‌ చాలా కవితాత్మకంగా వుంది. చిత్రం కూడా అంతే వుంటుందని అనుకుంటున్నాను. తప్పకుండా ఈ పాటతో పాటు చిత్రం కూడా విజయవంతం అవ్వాలని ఆశిస్తున్నాను' అన్నారు. 
 
ప్రణయ గోదావరి గ్లింప్స్, పోస్టర్లు, పాటలు ఆడియెన్స్‌లో మంచి బజ్‌ను క్రియేట్‌ చేస్తుండగా...తాజాగా విడుదల చేసిన చూడకయ్యో.. నెమలికళ్ళ తూగుతున్న తూనీగల్లా అనే బ్యూటీఫుల్‌ మెలోడి పాట వినగానే ఆకట్టుకునే విధంగా వుంది. ముఖ్యంగా పాట బాణీలు, సాహిత్యం ఎంతో చక్కగా కుదిరాయి. చాలా కాలం తరువాత జానపద సాహిత్యం మేళవించిన మెలోడి పాటను విన్న ఫీల్‌ కలుగుతుంది. ఈ పాట కుర్రకారుతో పాటు పాటల ప్రియుల అందర్ని కట్టి పడేసేలా ఉంది. ఈ పాట విన్నవాళ్లకి తప్పకుండా సినిమా చూడాలనే ఆసక్తి కలుగుతుంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. 
ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన రిలీజ్ డేట్‌ను ప్రకటించనున్నారు మేకర్స్.
 
నటీనటులు : సదన్, ప్రియాంక ప్రసాద్, సాయికుమార్ తదితరులు 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

2025 ఆస్కార్‌ అవార్డు కోసం అమీర్ ఖాన్ మాజీ భార్య లాపతా లేడీస్