Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

టాలీవుడ్ లో లైంగిక వేధింపుల పరిష్కారానికి మహిళా కమిటీ ఏర్పాటు

Chamber mahila kamity

డీవీ

, మంగళవారం, 17 సెప్టెంబరు 2024 (14:53 IST)
Chamber mahila kamity
తెలుగు ఫిల్మ్ & టీవీ డ్యాన్సర్స్ & డ్యాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్‌లో ప్రముఖ కొరియోగ్రాఫర్‌ మీద వచ్చిన ఈ ఫిర్యాదును  పరిష్కరించడానికి కమిటీని ఏర్పాటు చేశారు. ఈ ఫిర్యాదు విచారణ ప్రక్రియలో ఉంది, కావున ఆరోపించిన కొరియోగ్రాఫర్‌ను యూనియన్‌లో ప్రెసిడెంట్ పోస్ట్‌లో ఉంచడానికి విచారణ పూర్తయ్యే వరకు తాత్కాలికంగా నిలిపివేయబడుతుందని కమిటీ మధ్యంతర నివేదికను ఇవ్వడం జరిగింది.
 
మంగళవారంనాడు హైదరాబాద్ లోని తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ లో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా  లైంగిక వేధింపుల పరిష్కార ప్యానెల్ ఏర్పాటు చేస్తున్నట్లు కమిటీ ప్రకటించింది. ఇందులో K.L. దామోదర్ ప్రసాద్, Hon. సెక్రటరీ & కన్వీనర్, ఝాన్సీ, చైర్‌పర్సన్ గా వున్నారు. అంతర్గత సభ్యులుగా తమ్మారెడ్డి భరద్వాజ, సుచిత్రా చంద్రబోస్, వివేక్ కూచిభొట్ల, ప్రగతి మహావాది ఎంపికయ్యారు. ఇక బాహ్య సభ్యులుగా  రామలక్ష్మి మేడపాటి, సామాజిక కార్యకర్త,  మీడియా నిపుణురాలు కావ్య మండవ, న్యాయవాది మరియు POSH నిపుణురాలు కూడా వున్నారు. 
 
ఏదైనా లైంగిక వేధింపుల ఫిర్యాదుల విషయంలో మహిళలు తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్‌ను సంప్రదించవచ్చు. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కార్యాలయం వెలుపల ఫిర్యాదు పెట్టె ఉంచబడింది, దీనిని ఉదయం 6 నుండి రాత్రి 8 గంటల మధ్య యాక్సెస్ చేయవచ్చు.
 
అనంతరం వారు మాట్లాడుతూ,  ఫిర్యాదుల నిమిత్తమై మమ్మల్ని పోస్ట్ లేదా కొరియర్ ద్వారా క్రింది చిరునామాకు పంపవచ్చును.
తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, డా. డి. రామానాయుడు బిల్డింగ్ కాంప్లెక్స్, ఫిలింనగర్, జూబ్లీహిల్స్, హైదరాబాద్-500 096. ఫిర్యాదులను నమోదు చేయడానికి ప్రత్యేక ఫోన్ నంబర్ వాట్సాప్ లేదా టెక్స్ట్   నెం. 9849972280, ఈమెయిల్ ఐడీ: [email protected]
నోట్ : మీరు పంపబడిన వివరాలు గోప్యంగా ఉంచబడును అని గౌరవ కార్యదర్శి  హోదాలో  కె.ఎల్. దామోదర్ ప్రసాద్ తెలియజేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సి-అంటే సిగ్గు ని- అంటే నిజాయితీ.. మా- అంటే మానం వుండదు.. బషీర్ మాస్టర్ (video)