Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సి-అంటే సిగ్గు ని- అంటే నిజాయితీ.. మా- అంటే మానం వుండదు.. బషీర్ మాస్టర్ (video)

Advertiesment
Basheer Master

సెల్వి

, మంగళవారం, 17 సెప్టెంబరు 2024 (14:39 IST)
Basheer Master
టాలివుడ్ నిజ స్వరూపం నెమ్మదిగా బైటకు వస్తోంది. కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ గత రెండు రోజులుగా లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే సినీ ప్రముఖులు జానీ మాస్టర్ వేధింపుల కేసుపై రియాక్ట్ అవుతున్నారు. 
 
తాజాగా సింగర్ చిన్మయి సైతం ఈ కేసుపై స్పందించింది. "ఆ అమ్మాయి మైనర్‌గా ఉన్నప్పటి నుంచే జానీ మాస్టర్ వేధించడం ప్రారంభించాడు. ఈ కేసులో పోరాడేందుకు కావాల్సినంత శక్తి ఆ అమ్మాయికి చేకూరాలని నేను కోరుకుంటున్నాను" అని చిన్మయి ట్వీట్ చేశారు.
 
మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ యువతి కొన్నాళ్లుగా జానీ మాస్టర్ వద్ద పనిచేస్తుంది. సినిమా షూటింగ్స్ నిమిత్తం వివిధ ప్రాంతాలకు వెళ్లినప్పుడు జానీ మాస్టర్ తనతో అసభ్యకరంగా ప్రవర్తించాడని.. లైంగికంగా వేధించాడని ఆమె ఆరోపించింది. 
 
మతం మార్చుకుని పెళ్లి చేసుకోవాలని తనను బలవంతం చేశాడని.. ఈ విషయాన్ని బయటపెడితే ఇబ్బందిపెడతానని బెదిరించాడని.. ఇండస్ట్రీలో ఆఫర్స్ రాకుండా చేస్తానని బెదిరించాడని సదరు యువతి ఫిర్యాదులో పేర్కొంది. జానీ మాస్టర్ భార్య కూడా తనను తీవ్రంగా వేధించిందని తెలిపింది.

ఈ విషయమై బషీర్ మాస్టర్ మాట్లాడుతూ.. ఓ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ చేసిన ఫిర్యాదుపై జానీ మాస్టర్ ఎలాంటి వారంటూ చెప్పడం సరికాదని.. పోలీసులు నిజానిజాలను నిగ్గు తేల్చుతారని చెప్పారు.

సౌత్ కొరియోగ్రాఫర్, పాన్ ఇండియా కొరియోగ్రాఫర్‌పై ఇలాంటి ఆరోపణలు రావడం కాస్త జీర్ణించుకోలేని విషయమేనని చెప్పారు. తమ మధ్య యూనియన్ గొడవలు వున్నాయే తప్ప.. ఆయనతో వ్యక్తిగతంగా ఎలాంటి ఇబ్బందులు లేవన్నారు. మహిళలను గౌరవించాలని తెలిపారు. అసిస్టెంట్, సైడ్ యాక్టర్లపై జాలి చూపాలని, కొరియోగ్రాఫర్‌గా ఎదగాలంటే అంత సులువు కాదని.. అంత ఉన్నత స్థాయికి చేరుకుని ఇలా చీప్ ట్రిక్స్ ప్లే చేయడం తప్పన్నారు. 
 
ఇంకా అసిస్టెంట్ కొరియో గ్రాఫర్లను ఇలా వాడటం, మహిళలను వేరేగా చూడటం వంటివి సరికాదన్నారు. నిజాలేంటో తెలిశాక.. ఆ అమ్మాయి తరపున మద్దతిస్తామని చెప్పారు. సినిమా ఇండస్ట్రీకి వచ్చి అమ్మాయిలు చేసేదేమీ లేదని.. కానీ బాధపడి వెళ్లినోళ్లు చాలామంది వున్నారని తెలిపారు. లక్షల్లో ఇన్ స్టాలో ఫాలోవర్స్ వస్తే గొప్ప అనుకోవడం కాదని.. లక్ష ఫాలోవర్స్ వేస్టని.. సినిమా ఫీల్డ్‌కు వస్తే ప్రతి ఒక్కడూ.. సి అంటే సిగ్గుండదు. ని అంటే నిజాయితీ వుండదు. మ అంటే మానం వుండదు.. అన్నింటికి తెగబడి సినిమా ఫీల్డుకు రావాలి. 
 
అలా ఐతేనే రాండి. వచ్చిన తర్వాత నన్ను అది చేసిండు.. ఇది చేసిండు.. పేరు పోగొట్టుకోవడం తప్ప వేరే లేదని బషీర్ మాస్టర్ స్పష్టం చేశారు. ఎంతో మంది మోసంలో సినిమా ఫీల్డులో జీవించాల్సి వుంటుందని తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బిగ్ బాస్ హౌస్‌లో మూడో వారం.. ఎలిమినేట్ అయిన వారు ఎవరు?