Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మత్తువదలరా 2 సినిమా ఎలా వుందంటే.. రివ్యూ

Advertiesment
Sri Simha Koduri, Satya

డీవీ

, శుక్రవారం, 13 సెప్టెంబరు 2024 (18:54 IST)
Sri Simha Koduri, Satya
నటీనటులు: శ్రీ సింహ కోడూరి, సత్య, సునీల్, వెన్నెల కిషోర్, ఫరియా అబ్దుల్లా, అజయ్, ఝాన్సీ, తదితరులు
 సాంకేతికత: సినిమాటోగ్రఫీ: సురేష్ సారంగం, సంగీత దర్శకుడు: కాల భైరవ, ఎడిట‌ర్ : కార్తీక శ్రీనివాస్, నిర్మాతలు : చిరంజీవి (చెర్రీ) పెదమల్లు, హేమలత పెదమల్లు, దర్శకుడు: రితేష్ రానా
 
గతంలో వచ్చిన మత్తు వదలరా సినిమాకు సీక్వెల్ గా క్రైమ్ కామెడీ థ్రిల్లర్ “మత్తు వదలరా 2” నేడే విడుదలైంది. శ్రీ సింహా హీరోగా, సత్య మరో ముఖ్య పాత్రలో దర్శకుడు రితేష్ రానా తెరకెక్కించిన ఈ చిత్రం డ్రెగ్ మాఫియాతో కూడిన ఎంటర్ టైన్ మెంట్ గా తీశామని చిత్ర యూనిట్ చెప్పింది. మరి ఎలా ఉందో తెలుసుకుందాం. 
 
కథ:
మత్తువదలరా మొదటి పార్ట్ కు సీక్వెల్ గా బాబు మోహన్ (శ్రీ సింహా), యేసుదాసు (సత్య) ఇద్దరికీ జాబ్  వుండదు. కొద్దిరోజులకు ఒక హీ టీం (హెడ్ ఆఫ్ ఎమర్జెన్సీ) లో ఏజెంట్స్ చేరతారు. దీనికి హెడ్ (దీప) రోహిణి. వీరి ఎయిమ్ ఏమంటే, కిడ్నాప్ కేసులు సాల్వ్ చేస్తూ అందులో కొంచెం డబ్బు తస్కరిస్తూ లైఫ్ లీడ్ చేస్తారు. ఈ క్రమంలో వారికి మిస్సింగ్ కేసు వస్తుంది. హి టీమ్ గా వారు వెళ్ళి దాన్ని సాల్వ్ చేయడానికి ప్రణాళికలు వేస్తారు. ఆ క్రమంలో ఓ డ్రెగ్ గురించి తెలుసుకుంటారు. అంతేకాకుండా ఓ మర్డర్ కేసులో ఇద్దరూ ఇరుక్కుంటారు. ఆ తర్వాత వారు ఏమి చేశారు? కేస్ నుంచి బయటపడ్డారా? లేదా? అనేది మిగిలిన సినిమా. 
 
సమీక్ష:
ఫస్ట్ పార్ట్ మత్తు వదలరా చాలా కాలం అయినా రెండో భాగంకు క్రేజ్ వుంది. దాన్ని దర్శకుడు రాసుకున్న కథ కూడా చాలా లింక్ తో కూడుకున్నదే. ఎంటర్టైన్మెంట్ ని అందించింది అని చెప్పొచ్చు. ట్రైలర్ లోనే కమెడియన్ సత్య హైలైట్ అయినట్లు కనిపించింది. సినిమా చూశాక సత్య తన పెర్ఫార్మన్స్ తో షో ని తస్కరించాడు అని చెప్పాలి. సినిమాలో తన కామెడీ టైమింగ్ ఫస్ట్ పార్ట్ కంటే ఎక్కువ డోస్ లో ఉంది.
 
అయితే శ్రీ సింహా పాత్ర ధీటుగానే వుంది. పాత్ర తాలూకా హావభావాలు, మంచి పర్సనాలిటీలో పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. అలాగే తనకి సత్యకి నడుమ అన్నీ సీన్స్ నవ్వు తెప్పిస్తాయి. వీరికి తోడుగా ఫారియా అబ్దుల్లా హీ టీమ్ లో ఒక సాలిడ్ లేడీగా ఇంప్రెస్ చేస్తుంది. దానితోపాటు గ్లామర్ షో తో కూడా ఆకట్టుకుంది. ఇక  వెన్నెల కిషోర్ సరికొత్త కోణంలో కామెడీతోపాటు పాత్ర తాలూకా కామెడీ సీన్స్, థ్రిల్ సీన్స్ బాగున్నాయి. సునీల్, అజయ్, రోహిణి ఓకే. ఈ చిత్రం యూత్ తోపాటు పెద్దలను ఎంటర్ టైన్ చేస్తుందనే చెప్పాలి. 
 
అయితే మొదటి భాగం కంటే రెండో భాగంలో  థ్రిల్ ఎలిమెంట్స్ తీసే విధానం ఇంకాస్త నాచురల్ గా వుంటే బాగుండేది. కొన్ని సన్నివేశాల్లో లాజిక్ మిస్ అయినట్లు కనిపిస్తుంది. కేవలం వినోదాన్ని పండించాలనే కాన్సెప్ట్ తో తీసిని సినిమా ఇది. ఈ క్రమంలో కొన్ని సన్నివేశాలు రొటీన్ గా వున్నాయనే చెప్పాలి.  సెకాండఫ్ లో కథనం ట్విస్ట్ లు సోసో గానే అనిపిస్తాయి. వెన్నెల కిశోర ఓరినా కొడకా.. అనే డైలాగ్.. ఎంటర్ టైన్ లో బాగుంది. 
 
ఇక దర్శకుడు రితేష్ రానా మరో సారి తాను తన మార్క్ కామెడీ థ్రిల్స్ ని తనదైన శైలిలో మెప్పించే ప్రయత్నం చేశాడు. రాసుకున్న థ్రిల్ లైన్ కూడా బాగానే ఉంది కాని అది మరీ అంత ఎంగేజ్ చేసే విధంగా అనిపించదు. నిర్మాణ విలువలు బాగానే ఉన్నాయి. సంగీత దర్శకుడు కాల భైరవ  చేసిన పాటలు, మూడ్ ని మ్యాచ్ చేస్తూ కనిపిస్తాయి. ఇంకా సినిమాటోగ్రఫీ, మెయిన్ గా డైలాగ్స్ బాగున్నాయి. అలాగే ఎడిటింగ్ కూడా బాగానే ఉంది. కామెడీ వరకు సినిమాలో బాగానే  వుంది.  థ్రిల్ ఎలిమెంట్స్ కూడా బాగానే ఉన్నాయి కానీ ఈ అంశం మాత్రం రొటీన్ గా వుంది. అయినా ఈ సినిమా చూసి ఎంజాయ్ చేయవచ్చు. 
రేటింగ్ : 3/5 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కార్తీ, అరవింద్ స్వామి ల సత్యం సుందరం నుంచి హ్యుమరస్ & హార్ట్ వార్మింగ్ టీజర్