Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నందమూరి తారక రామారావు సినిమాకి చంద్రబోస్, కీరవాణి, బుర్ర సాయిమాధవ్ పనిచేస్తున్నారు

Burra Saimadhav, Yvs chowdary, geeta, veena Rao

డీవీ

, శనివారం, 10 ఆగస్టు 2024 (09:26 IST)
Burra Saimadhav, Yvs chowdary, geeta, veena Rao
నందమూరి వారసుడు, లెజెండరీ ఎన్టీఆర్ ముని మనవడు, హరికృష్ణ మనవడు, దివంగత జానకిరామ్ తనయుడు నందమూరి తారక రామారావు ఫిలిమ్స్ లోకి గ్రాండ్ ఎంట్రీ ఇస్తున్నారు. వైవిఎస్ చౌదరి రచన, దర్శకత్వం వహిస్తున్న ఈ ఎక్సయిటింగ్ ప్రాజెక్ట్ ని "న్యూ టాలెంట్ రోర్స్ @" బ్యానర్‌పై యలమంచిలి గీత నిర్మించనున్నారు. ఈ చిత్రంలో తెలుగమ్మాయి వీణ రావ్ హీరోయిన్ గా నటిస్తున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. 
 
ఈ సినిమాకు ఆస్కార్ విన్నర్స్  కంపోజర్ ఎంఎం కీరవాణి సంగీతం, లిరిక్ రైటర్ చంద్రబోస్ తోపాటు డైలాగ్ రైటర్ సాయి మాధవ్‌ బుర్రా మాటలు అందిస్తున్నారు.
 
ఈ సందర్భంగా వైవిఎస్ చౌదరి మాట్లాడుతూ, ఈ రోజు నాగ పంచమి. మొదటి శ్రావణ శుక్రవార శుభ సందర్భం. ఈ సినిమాకి సంబధించిన మొదటి ఈవెంట్ మా ఆరాధ్య దైవం నందమూరి తారకరామారావు గారి అబ్బాయి నందమూరి బాలకృష్ణ గారి పుట్టిన రోజున జరుపుకున్నాం. ఈ రోజు కార్యక్రమం సూపర్ స్టార్ మహేష్ బాబు గారి బర్త్ డే సందర్భంగా జరుపుకోవడం చాలా ఆనందంగా వుంది. మహేష్ బాబు అంటే చైల్డ్ ఆర్టిస్ట్ గా ఉన్నపటినుంచి ఇష్టం. మహేష్ గారు నా మొదటి సినిమా చూడకుండానే 'యువరాజు' సినిమాకి అవకాశం ఇచ్చారు. అది ఆయన నామీద ఉంచిన నమ్మకం. ఆ నమ్మకం నాకు ఎంతో ఆత్మీయంగా అనిపించింది. రాజకుమారుడు చేస్తున్న సమయంలోనే నా నిర్మాణ సంస్థ బొమ్మరిల్లుని స్థాపించాను. లాహిరి లాహిరిలో సినిమా విజయోత్సవ వేడుకకు ఆయనే స్వచ్చందంగా వచ్చి వెన్నంటి వున్నారు.
 
అలాగే ఈ సినిమా కథని నేను రాసుకున్నాను. దీనికి అర్ధవంతమైన మాటలు రాయడానికి సమర్దవంతమైన మాటల రచయిత కావాలి. కంచె సినిమా చూసినప్పుడే సాయి మాధవ్ బుర్రాతో పని చేయాలని అనుకున్నాను. ఆయన అన్ని సినిమాలకు న్యాయం చేశారు. ప్రతి సినిమాకి గొప్పగా ఎదిగారు. ఇప్పుడు ఈ సినిమాతో ఆయనతో పని చేయడం చాలా ఆనందంగా వుంది. సినిమాకి సంగీతం, సాహిత్యం ప్రాణంగా భావిస్తుంటాను. కీరవాణి గారు యుగపురుషుడు లాంటి వారు. ఒక సంగీత దర్శకుడికి ఎంత ప్రావీణ్యం ఉండాలో అంత ప్రావీణ్యం వున్న సంగీత దర్శకుడాయన. ఆయనతో నా మొదటి సినిమాకి పని చేయడం నా అదృష్టం. ఆయన నాకు మర్చిపోలేని పాటలు, నేపధ్య సంగీతం ఇచ్చారు. అలాంటి మహానుభావుడితో ఈ సినిమా చేసిన చేయడం చాలా ఆనందంగా వుంది. ఆయన కథ విని చాలా ఆనందంగా ఫీలయ్యారు. ఒక పెద్దన్నయ్యలా సలహాలు సూచనలు ఇచ్చారు. ఆయనకి సభాముఖంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. సాహిత్య చిచ్చరపిడుగు చంద్రబోస్ గారు ఈ సినిమాకి సాహిత్యం అందిస్తున్నారు. ఆయన సాహిత్యం మహా అద్భుతంగా వుండబోతోంది. 
 
నేను పరిచయం చేసిన ఎంతో మంది హీరోయిన్స్ స్టార్స్ గా వెలిగారు. అయితే ఇందులో చాలా మంది ముంబై నుంచి వచ్చిన వారే. ఈసారి మన తెలుగు నుంచి ఒక అమ్మాయిని పరిచయం చేయాలని భావించాం. ఇలాంటి సమయంలో ఓ అమ్మాయి తారసపడింది. తను అద్భుతంగా వుంది. అందమైన తెలుగు భారతీయ అమ్మాయిలా అనిపించింది. గొప్ప రూప సౌందర్యం వుంది. ఆమె పేరు వీణ రావు. మన తెలుగమ్మాయి. తను మంచి కూచిపూడి డ్యాన్సర్. ఈ మూవీలో అతిరథ మహారథులు ఇంకెదరో వుంటారు. అలాగే కొత్త ట్యాలెంట్ ని కూడా ప్రోత్సహిస్తున్నాం. సోషల్ మీడియా వేదికగా వివరాలు చెబుతాం. మేము చెప్పిన ప్రమాణాలు అనుగుణంగా మీ ట్యాలెంట్స్ ని మాకు పంపించవచ్చు.దాని నుంచి కొంతమందిని ఎంపిక చేస్తాం' అన్నారు.  
 
డైలాగ్ రైటర్ సాయి మాధవ్ బుర్రా మాట్లాడుతూ.. న్యూ టాలెంట్ రోర్స్ బ్యానర్ లో వైవిఎస్ చౌదరి గారు కీరవాణి గారు చంద్రబోస్ గారు లాంటి మహామహులతోకలిసి పని చేసే అవకాశం ఇచ్చిన నిర్మాత యలమంచిలి గీత గారికి ధన్యవాదాలు. కథ విన్నాను, చాలా మంచి కథ. బ్యానర్ లానే ప్రతిభించే ప్రతిభ గర్జిస్తే ఎలా వుంటుందో సినిమా కూడా అలానే వుంటుంది. మంచి డైలాగ్స్ రాసే అవకాశం వున్న కథ. ప్రాణం పెట్టి ఈ సినిమాకి పని చేస్తాను' అన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హైదరాబాద్‌లో అజిత్ కుమార్ గుడ్ బ్యాడ్ అగ్లీ కీలక షెడ్యూల్ పూర్తి