Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

గెటప్ శ్రీను రాజు యాదవ్ కోసం గాయకుడయిన చంద్ర బోస్

Getup Srinu

డీవీ

, శనివారం, 11 మే 2024 (16:02 IST)
Getup Srinu
సాయి వరుణవి క్రియేషన్స్, ఖరిష్మ డ్రీమ్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై  గెటప్ శ్రీను హీరో గా రూపొందిన చిత్రం "రాజు యాదవ్ ". నిజ జీవితంలో జరిగిన కొన్ని యదార్థ సంఘటనల ఆధారంగా  రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం ద్వారా కృష్ణమాచారి . కె దర్శకుని గా పరిచయం అవుతున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ ద్వారా మే 17న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతున్న సందర్బంగా రాజు యాదవ్ టీం ప్రమోషన్స్ విషయంలో జెట్ స్పీడ్ లో దూసుకుపోతుంది.
 
రీసెంట్ గా హనుమాన్ సినిమా తో ప్యాన్ ఇండియా హీరో గా ఎదిగిన సూపర్ హీరో "తేజ్ సజ్జా" చేతులు మీదగా విడుదలైన ట్రైలర్ కి అధ్బుతమైన రెస్పాన్స్ వస్తూ సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో వుంది.
 
ఇప్పుడు రాజు యాదవ్ టీం నుండి మరో సాంగ్ రిలీజ్ చేశారు. నాటు నాటు పాటతో ప్రపంచాన్ని ఉర్రూతలూగించి ఆస్కార్ అవార్డు అందుకున్న అక్షర తపస్వి చంద్ర బోస్ గారి పుట్టినరోజు సందర్భంగా ఆయన సాహిత్యం అందించి, స్వయంగా ఆయనే పాడిన "లేదే లేదే ప్రేమసలే" పాటని విడుదల చేశారు.  
 
చంద్ర బోస్ గారి గొంతుతో ఈ పాట వింటున్న కొద్ది మన గుండె బరువెక్కుతుంది. అత్యంత సహజంగా,వాడుక భాషలో గుండెకి హత్తుకునేలా పాట  రాయడం అంటే ఒక్క చంద్ర బోస్ గారికే చెల్లుతుంది అని మరోసారి ప్రూవ్ చేసారు. ఈ సాహిత్యానికి తగ్గట్టు బ్లాక్ బస్టర్ మ్యూజిక్ డైరెక్టర్ హర్షవర్ధన్ రామేశ్వర్ ఇచ్చిన మ్యూజిక్ పాట విన్న వారిని మళ్ళీ మళ్ళీ వినేలా మ్యూజిక్ కంపోజ్ చేసారు.  
 
చిత్ర నిర్మాతలైన ప్రశాంత్ రెడ్డి , రాజేష్ కల్లెపల్లి మాట్లాడుతూ ఇప్పటివరకు మా సినిమా నుండీ విడుదలైన ప్రతి కంటెంట్ ప్రేక్షకులని మెప్పించిందని.. రీసెంట్ గా రిలీజ్ చేసిన ట్రైలర్ కి వస్తున్న రెస్పాన్స్ మా సినిమా మీద మాకు మరింత నమ్మకం కలిగించిందని, చిన్న సినిమాగా మొదలైనా మా సినిమాని ఇంతమంది సినీ ప్రముఖులు, మీడియా వ్యక్తులు సపోర్ట్ చెయడం తో మాకు చాలా సంతోషంగా వుందని, ఖచ్చితంగా మీ మా అంచనాలను దాటి పెద్ద హిట్ అవుతుందని, త్వరలోనే భారీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తామని చెప్పారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పిఠాపురంకు బయలుదేరిన రామ్ చరణ్, సురేఖ, అల్లు అరవింద్