Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రాజు యాదవ్‌ లో థిస్ ఈజ్ మై దరిద్రం అంటూ స్టెప్ లేస్తున్న గెటప్ శ్రీను

Raju Yadav- daridram song

డీవీ

, సోమవారం, 29 ఏప్రియల్ 2024 (13:30 IST)
Raju Yadav- daridram song
జబర్దస్త్ ఫేమ్ గెటప్ శ్రీను హోల్సమ్ ఎంటర్ టైనర్ 'రాజు యాదవ్' తో హీరోగా ఆరంగేట్రం చేస్తున్నారు. ఈ చిత్రం ద్వారా కృష్ణమాచారి దర్శకునిగా పరిచయం అవుతున్నారు. సాయి వరుణవి క్రియేషన్స్, చరిష్మా డ్రీమ్స్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లపై కె. ప్రశాంత్ రెడ్డి, రాజేష్ కల్లెపల్లి సంయుక్తంగా ఈ ప్రాజెక్ట్‌ను నిర్మించారు.
 
ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్‌, ఫస్ట్ సింగిల్-రాజు యాదవ్ చూడు కు పాటకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ చిత్రం నుంచి 'థిస్ ఈజ్ మై దరిద్రం' సాంగ్ ని  హీరో సుడిగాలి సుదీర్ లాంచ్ చేశారు.
 
స్టార్ కంపోజర్ హర్షవర్ధన్ రామేశ్వర్ ఈ పాటని క్యాచి బీట్స్ తో ఎనర్జిటిక్ గా ట్యూన్ చేశారు. రాహుల్ సిప్లిగంజ్, మంగ్లీ హై వోకల్స్ పాటకు మరింత ఆకర్షణ తీసుకొచ్చాయి. కాసర్ల శ్యామ్ అందించిన సాహిత్యం హీరో క్యారెక్టర్ ని హిలేరియస్ గా ప్రజెంట్ చేసింది. ఈ పాటలో హీరోకి ఎదురయ్యే సిట్యువేషన్స్ నవ్వులు పంచాయి.  
 
లవ్, కామెడీతో పాటు సినిమాలో హృదయాన్ని హత్తుకునే భావోద్వేగాలు కూడా వున్నాయి.  
 
రాజుయాదవ్ మే 17న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది.
 
నటీనటులు: గెటప్ శ్రీను, అంకిత ఖరత్, ఆనంద చక్రపాణి, రాకెట్ రాఘవ, మిర్చి హేమంత్, జబర్దస్త్ సన్నీ, సంతోష్ కల్వచెర్ల, శ్రీరామ్, కళ్యాణ్ భూషణ్, శ్రీమణి, పవన్ రమేష్, ఉత్తర ప్రశాంత్, తదితరులు..
 
సాంకేతిక విభాగం:
రచన, దర్శకత్వం: కృష్ణమాచారి. కె
నిర్మాతలు: ప్రశాంత్ రెడ్డి, రాజేష్ కల్లెపల్లి
బ్యానర్లు: సాయి వరుణవి క్రియేషన్స్, చరిష్మా డ్రీమ్స్ ఎంటర్టైన్మెంట్
సంగీతం: హర్షవర్ధన్ రామేశ్వర్
డీవోపీ: సాయిరామ్ ఉదయ్ D.F.Tech
సాహిత్యం: చంద్రబోస్, కాసర్ల శ్యామ్
ఎడిటర్: బొంతల నాగేశ్వర రెడ్డి
ప్రొడక్షన్ డిజైనర్: శ్రీ నాగేంద్ర తంగేళా
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: విప్లవ్
గాయకులు: చంద్రబోస్, రామ్ మిరియాల, రాహుల్ సిప్లిగంజ్, మంగ్లీ, యసస్వి కొండేపూడి
కొరియోగ్రఫీ: జిత్తు మాస్టర్
 
------------------------------------------------
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో, స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం లో దేవర పార్ట్1 చిత్రాన్ని చేస్తున్నారు. ఈ చిత్రం పూర్తి కాకముందే, బాలివుడ్ స్టార్ హీరో అయిన హృతిక్ రోషన్‌తో కలిసి తన బాలీవుడ్ అరంగేట్రం వార్ 2 షూటింగ్‌లో చేరారు. నిన్న సాయంత్రం ఎన్టీఆర్, స్టార్ జంట రణబీర్ కపూర్ మరియు అలియా భట్, హృతిక్ రోషన్, అతని స్నేహితురాలు సబా ఆజాద్ మరియు కరణ్ జోహార్‌లతో కలిసి చిక్ రెస్టారెంట్ వద్ద కనిపించారు. వారి డిన్నర్ డేట్ కి సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
 
అభిమానులు మరియు మీడియాలో ఈ ఫోటోలు ఉత్సాహాన్ని రేకెత్తించాయి. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన రణబీర్ కపూర్ మరియు అలియా భట్ నటించిన బ్రహ్మాస్త్ర చిత్రానికి కరణ్ జోహార్ నిర్మాత. ముఖర్జీ చేస్తున్న తాజా చిత్రం వార్ 2. హృతిక్ మరియు జూనియర్ ఎన్టీఆర్‌లు ఇందులో నటిస్తున్నారు. ముఖ్యంగా హృతిక్ రోషన్, ఎన్టీఆర్ లను ఒకే ఫ్రేమ్ లో చూడటానికి ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నల్లగండ్లలో బాబాయ్ హోటల్‌ను ప్రారంభించిన హీరో శ్రీకాంత్