ఆనంది, వరలక్ష్మి శరత్‌కుమార్ ప్రధాన పాత్రలలో దేవరాజ్ భరణి ధరణ్ దర్శకత్వంలో ఫస్ట్ కాపీ మూవీస్ బ్యానర్ పై నరేష్ బాబు పి. నిర్మించిన పవర్ ఫుల్ విమెన్ సెంట్రిక్ ఫిల్మ్ శివంగి. జాన్ విజయ్, డాక్టర్ కోయ కిషోర్ కీలక పాత్రల్లో నటించారు. ఇటివలే రిలీజ్ చేసిన టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది.
ఈ రోజు మేకర్స్ సినిమా 'శివంగి' థ్రిల్లింగ్ ట్రైలర్ రిలీజ్ చేశారు. అందరి జీవితంలో గుడ్ డే, బ్యాడ్ డే అని ఒక రోజు వుంటుంది. కానీ నా జీవితంలో రెండూ ఒకే రోజు జరిగాయి' అంటూ ఆనంది చెప్పిన డైలాగ్ తో ఓపెన్ అయిన ట్రైలర్ ఆద్యంతం థ్రిల్లింగ్ సాగింది. వరలక్ష్మి శరత్‌కుమార్ కు ఆనందిని విచారించడం చాలా ఇంట్రస్టింగ్ గా వుంది.
ఆనంది జీవితంలో జరిగిన విషయాలు చాలా సస్పెన్స్ ఫుల్ గా ప్రజెంట్ చేశారు. సత్యభామ క్యారెక్టర్ లో ఆమె పెర్ఫార్మెన్స్ అదిరిపోయింది. సత్యభామరా .. సవాల్ చేయకు చంపేస్తా' అనే డైలాగ్ అదిరిపోయింది.
వరలక్ష్మిశరత్‌కుమార్ పవర్ ఫుల్ క్యారెక్టర్ లో కనిపించింది. డైరెక్టర్ దేవరాజ్ భరణి ధరన్ డిఫరెంట్ స్టొరీ తో ప్రేక్షకులని అలరించబోతున్నారని ట్రైలర్ చూస్తే అర్ధమౌతోంది. A.H కాషిఫ్ - ఎబినేజర్ పాల్ మ్యూజిక్, భరణి కె ధరన్ కెమరా వర్క్ సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ని మరింతగా పెంచాయి.
మార్చి 7న రిలీజ్ కానున్న ఈ సినిమాపై ఈ ట్రైలర్ అంచనాలని మరింతగా పెంచింది.
నటీనటులు: ఆనంది, వరలక్ష్మి శరత్‌కుమార్,జాన్ విజయ్, డాక్టర్ కోయ కిషోర్