Webdunia - Bharat's app for daily news and videos

Install App

Sidhu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా మధ్య కెమిస్ట్రీ తెలుసు కదా

దేవీ
సోమవారం, 28 జులై 2025 (19:01 IST)
Sidhu Jonnalagadda, Raashi Khanna, Neeraj Kona, TG Vishwa Prasad
సిద్ధు జొన్నలగడ్డ రొమాంటిక్ డ్రామా తెలుసు కదా, ప్రముఖ స్టైలిస్ట్ నీరజా కోన దర్శకత్వంలో, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టిజి విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. థమన్ ఎస్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. మేకర్స్ ఫస్ట్ సింగిల్ - మల్లికా గంధను లాంచ్ చేయడం ద్వారా మ్యూజిక్ ప్రమోషన్‌లను ప్రారంభించారు.
 
మల్లికా గంధ లవ్ అండ్ మ్యూజికల్ మ్యాజిక్ తో మనసును తాకే అద్భుతమైన పాట. ట్యూన్, విజువల్స్ ప్రతీదీ  ప్రేమ భావోద్వేగాలను బ్యూటీఫుల్ గా ప్రజెంట్ చేస్తోంది. థమన్ ఎస్ కంపోజిషన్ బ్రిలియంట్ గా వుంది. తంబురా, ఫ్లూట్ లాంటి ట్రెడిషనల్ వాయిద్యాల్ని మోడరన్ టచ్ లో వినిపించడం అదిరిపోయింది.
 
సిద్ శ్రీరామ్ వాయిస్ మాటల్లో చెప్పలేనంత ఫీల్ ని ఇస్తుంది. అతని వాయిస్ లోని ఇంటెన్సిటీ పాటకి ఓ ప్రత్యేక స్టయిల్ ని తీసుకొచ్చింది. దర్శకురాలు నీరజా కోన, సినిమాటోగ్రాఫర్ జ్ఞాన శేఖర్ వి.ఎస్ కలసి ప్రేమ ప్రపంచాన్ని తెరపై అద్భుతంగా మలిచారు. ప్రతీ ఫ్రేమ్ విజువల్ ఫీస్ట్ లా వుంది.
 
సిద్ధు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా మధ్య ఉన్న కెమిస్ట్రీ, ఇద్దరి నేచురల్ బాడీ లాంగ్వేజ్ సాంగ్ కు మరింత బ్యూటీని యాడ్ చేశాయి. రొమాంటిక్ సీన్స్, జోష్ నింపే డ్యాన్స్ మూమెంట్స్ తో అదరగొట్టారు. లవ్ అండ్ మ్యూజికల్ సెలబ్రేషన్స్ కు ఇది పర్ఫెక్ట్ సాంగ్ గా నిలిచింది.  
 
ఈ మూవీలో మరో హీరోయిన్ గా శ్రీనిధి శెట్టి నటిస్తున్నారు. వైవా హర్ష కీలక పాత్రలో కనిపించనున్నాడు. నేషనల్ అవార్డు విన్నర్ నవీన్ నూలి ఎడిటర్. అవినాష్ కొళ్ల  ఆర్ట్ డైరెక్షన్, కాస్ట్యూమ్స్ షీతల్ శర్మ. సినిమా ఈ దీపావళి కానుకగా అక్టోబర్ 17న విడుదల  కానుంది.
తారాగణం: సిద్దు జొన్నలగడ్డ, రాశి ఖన్నా, శ్రీనిధి శెట్టి, వైవా హర్ష

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మహిళ లో దుస్తుల్లో రెండు తాబేళ్లు.. అలా కనుగొన్నారు..?

జగన్ పైన గులకరాయి విసిరిన నిందితుడు కడపలో.., పట్టుకొచ్చారు (video)

Couple: బైకుపై అంకుల్-ఆంటీల రొమాన్స్.. హగ్గులు, కిస్సులతో ఈ లోకాన్ని మరిచిపోయారు.. (video)

చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి కోర్టులో చుక్కెదురు

Cobra-బీహార్‌లో షాకింగ్ ఘటన: నాగుపామును కొరికి చంపేసిన బుడ్డోడు!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments