Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అద్దెకు ఉంటున్న యువతి బాత్రూమ్‌లో సీక్రెట్ కెమెరా... లైవ్‌లో చూస్తూ పైశాచికం...

Advertiesment
camera

ఠాగూర్

, ఆదివారం, 6 జులై 2025 (17:59 IST)
ఓ యువతి అద్దెకు ఉంటున్న ఇంటి బాత్రూమ్‌లో ఇంటి యజమాని రహస్య కెమెరా అమర్చి.. లైవ్‌లో చూస్తూ పైశాచికానందం పొందుతూ వచ్చాడు. చివరకు అతని పాపం పండటంతో ఈ దారుణ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లక్నోలో చోటుచేసుకుంది. వివరాలను పరిశీలిస్తే, 
 
బహ్రైచ్‌కు చెందిన ఓ యుతి లక్నోలో అద్దె ఇంట్లో నివసిస్తోంది. ఈ నెల జూన్ 24 తేదీన తన బాత్రూమ్‌లో ఓ రహస్య కెమెరా ఉండటాన్ని ఆమె గమనించి షాక్‌కు గురైంది. దాన్ని పరిశీలించగా, వైఫైకి కనెక్ట్ చేసి ఉందని గుర్తించింది. వెంటనే ఆ కెమెరాను తొలగించగా ఇంటి యజమాని అక్కడికి వచ్చాడు. 
 
ముందుగా తన తప్పును అంగీకరించి క్షమించాలని ప్రాధేయపడ్డాడు. అయితే, పోలీసులకు ఫిర్యాదు చేస్తానని బాధితురాలు హెచ్చరించడంతో అతడిలోని మరో కోణం వెలుగు చూసింది. ఆమెపై అత్యాచారానికి యత్నించాడు. బాధితురాలు అతడి ుంచి తప్పించుకుని గదిలోకి గడియ పెట్టుకుంది. దీంతో ఆగ్రహానికి గురైన యజమాని ఈ విషయం బయటకు చెబితే ఆమె తల్లిని చంపేస్తానని సోదరిపై అత్యాచారం చేస్తానని తీవ్రంగా బెదిరించినట్టు బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొంది. 
 
బాధితురాలి ఫిర్యాదు మేరకు దుబర్గా పోలీసులు నిందితుడిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని, నిందితుడుపై కఠిన చర్యలు తీసుకుంటామని ఇన్‌స్పెక్టర్ తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హనీమూన్ ట్రిప్ పేరుతో ఘరానా మోసం... కొత్త జంటకు కుచ్చుటోపీ...