Webdunia - Bharat's app for daily news and videos

Install App

క్రేజీ ప్రాజెక్ట్‌లో తెలుగింటి అమ్మాయి...

Webdunia
గురువారం, 25 ఏప్రియల్ 2019 (16:03 IST)
హీరోయిన్ బిందుమాధవి తెలుగు ఆడపడుచు అయినా ఎక్కువగా తమిళ సినిమాలలో నటించి మంచి పేరు తెచ్చుకుంది. 'కళుగు' అనే తమిళ సినిమాలో ఆమె నటనకు అనేక ప్రశంసలు దక్కాయి. అయితే ఈ మధ్యకాలంలో సినిమా అవకాశాలు లేక కనుమరుగైపోయిన ఈమెకు ఓ లక్కీఛాన్స్ తలుపు తట్టిందని సమాచారం.
 
కోలీవుడ్‌లో పేరున్న దర్శకుడు బాలా ఎప్పుడూ వాస్తవిక సినిమాలు చేస్తుంటారు. వీటిలో నటులెంత వాళ్లైనా పాత్రలే కనిపిస్తాయి. బాలా యువ హీరోలతో మల్టీస్టారర్‌ చిత్రాన్ని తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్న నేపథ్యంలో సూర్య హీరోగా చిత్రం చేయబోతున్నారనే ప్రచారం జరిగింది. బాలా చెప్పిన కథ సూర్యకు బాగా నచ్చినప్పటికీ బిజీ షెడ్యూల్ కారణంగా ఈ ప్రాజెక్ట్‌కు బ్రేక్ పడింది.
 
దీంతో బాలా సినిమాలో ప్రస్తుతం నటించలేనని సూర్య చెప్పడంతో ఆయన మరో కథను తయారు చేసుకున్నారు. ఇందులో హీరోలుగా ఆర్య, అధర్వ నటిస్తున్నారు. ఈ సినిమాలో బిందుమాధవికి నటించే అవకాశం వచ్చిందని టాక్ వినిపిస్తోంది. దీనిపై ఇంకా అఫిషియల్ ప్రకటన రావాల్సి ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పోలీసుల ముందు లొంగిపోయిన 86మంది మావోయిస్టులు..

మంచాన్ని కారుగా మార్చుకున్నాడు... ఎంచక్కా రోడ్డుపై జర్నీ - వీడియో వైరల్

క్రికెట్ ఆడుతూ గుండెపోటుతో మైదానంలోనే మృతి చెందిన యువకుడు

మానవ్ శర్మ ఆత్మహత్య కేసు: భార్య, మామను అరెస్ట్ చేసిన పోలీసులు.. ఎందుకంటే?

ఇద్దరి పిల్లల్ని కట్టేసి మహిళపై అత్యాచారం చేసిన డ్రైవర్, కండక్టర్, క్లీనర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

తర్వాతి కథనం
Show comments